కంగనకు సమన్లు జారీ చేయనున్న ముంబై పోలీస్

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసినా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పేరే మారు మోగిపోతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనక కారణాలను వెలికి తీయాలని, నిందితులను శిక్షించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్న కంగన, ఈ వ్యవహారంలో ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడిందని తెలుస్తూనే ఉంది. తాజాగా ఆమెకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సుశాంత్ మరణంపై ఆమె వివరణ కూడా నమోదు చేసుకునేందుకు ఈ సమన్లు సిద్ధం చేస్తున్నారు.

గతంలో ఓసారి కంగనకు సమన్లు జారీ చేసినా, అవి కంగనను చేరుకోలేకపోయాయి. బాంద్రా పోలీసులు జులై 3వ తేదీనా జిమ్ ఖానాలోని ఆమె ఇంటికి సమన్లు పంపించారు. అయితే కంగన ప్రస్తుతం ఇక్కడ లేదని ఆమె అసిస్టెంట్ పోలీసులకు తెలపగా, వారు అమెనే సమన్లు స్వీకరించి కంగనకు సమాచారం చేరవేయాల్సిందిగా కోరారు. కానీ, ఆమె సమన్ల తీసుకునేందుకు నిరాకరించడంతో, ముంబై పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

Fresh Summons to Kangana, Her leagal team steps in

ఇక చివరాఖరికి కంగన అక్క రంగోలిని కాంటాక్ట్ చేసిన పోలీసులు, కంగనను ముంబైలోని విచారణకు హాజరుకావాల్సిందిగా సూచించారు. దీనిపై స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన కంగన టీమ్, విచారణకు సహకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కాకపోతే, తమకు ఇప్పటివరకూ ఎలాంటి సమన్లూ అందలేదని ట్వీట్ లో పేర్కొంది. మరోవైపు పోలీసులతో కాంటాక్ట్ లోనే ఉన్న రంగోలి, ఎలాంటి సమాచారం కావాలన్నా తమ న్యాయ నిపుణులను సంప్రదించాల్సిందిగా పోలీసులను కోరింది. అంతేకాదు, ముంబై పోలీసులతో తాను జరిపిన సంభాషణను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు న్యాయం జరగడమే తమ అభిమతమని, కాబట్టి, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొంది. వీలైతే విచారణకు సంబంధించిన ప్రశ్నలు పంపితే, తాను ఉన్న చోటే జవాబులు రికార్డ్ చేసి పంపించేందుకూ తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకూ సుశాంత్ మరణ వ్యవహారంలో 39మందిని విచారించిన ముంబై పోలీస్, కేసులో కీలకమైన యజ్ రాజ్ సంస్థపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆదిత్య చోప్రా తన స్నేహితుడైన కరణ్ జోహార్ తో కలిసి, కావాలనే సుశాంత్ కెరీర్ ను నాశనం చేశాడని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. మరి ముందు ముందు ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X