Sunny Deol: కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన స్టార్‌ హీరో.. కోలుకోలేని షాక్ ఇచ్చిన ఫేమస్ బ్యాంక్

బాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ సుదీర్ఘ కాలంగా బడా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ప్రముఖ హీరో సన్నీ డియోల్ అలియాస్ అజయ్ సింగ్ డియోల్. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయన.. చాలా కాలంగా విజయాన్ని మాత్రం అందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'గదర్ 2' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇలా ఇది దాదాపు రూ. 400 కోట్లు వరకూ వసూలు చేసి బాక్సాఫీస్ దుమ్ముదులిపేసింది.

'గదర్ 2' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సన్నీ డియోల్‌కు తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా కోలుకోలేని షాక్ ఇచ్చింది. 2016లో ఓ సినిమా కోసం ఈ స్టార్ హీరో స్థానిక బ్యాంకులో కొన్ని కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు. దీనికి హామీగా ముంబైలోని జుహూలో ఉన్న ఓ విల్లాను హామీగా పెట్టారు.

Gadar 2

అయితే, సన్నీ డియోల్ కొన్ని నెలలుగా వడ్డీ చెల్లించకపోవడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి పలుమార్లు సన్నీ డియోల్‌కు నోటీసులు వచ్చాయి. వీటికి సైతం ఈ బాలీవుడ్ స్టార్ రెస్పాండ్ కాలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఈ విల్లాను వేలం వేస్తున్నట్లుగా సదరు బ్యాంకు ప్రకటించింది.

సన్నీ డియోల్ 2016లో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి లోన్ తీసుకోగా.. 2022 డిసెంబర్ వరకూ క్రమం తప్పకుండా చెల్లించారు. ఆ తర్వాత మాత్రం ఆయన ఈఎంఐను చెల్లించడం ఆపేశారు. దీంతో తీసుకున్న అప్పు, వడ్డీతో కలిపి బ్యాంక్ ఆఫ్ బరోడాకు సన్నీ డియోల్ రూ. 56 కోట్లు మేర బాకీ పడ్డారు. ఈ విషయాన్ని తాజా ప్రకటనలో బ్యాంక్ వివరించింది.

బ్యాంకు నిబంధనల ప్రకారం.. సన్నీ డియోల్ విల్లాను స్వాధీనపరుచుకోవడంతో పాటు లోన్ రికవరీ కోసం సెప్టెంబర్ 25వ తేదీన వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ నేషనల్ న్యూస్ పేపర్‌లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ విల్లా విలువను బ్యాంక్ రూ. 51.43 కోట్లుగా నిర్ణయించింది. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ. 5.14 కోట్లు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తాజా ప్రకటనలో బ్యాంకు పేర్కొంది.

Gadar 2

ఇదిలా ఉండగా.. కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న సన్నీ డియోల్.. కేవలం రూ. 56 కోట్లు బ్యాంకుకు ఎందుకు చెల్లించలేదు అన్నది ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆయన అనుకుంటే బ్యాంకుతో పరిష్కరించుకునే వాళ్లని, ఏదో ఉద్దేశ్యం ఉండబట్టే రుణాన్ని ఎగ్గొట్టి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X