తనుశ్రీ దత్తా చెప్పేందంతా అబద్దం, నానా పాటేకర్ మంచోడు అంటున్న గణేష్ ఆచార్య!

ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. 2008లో 'హార్న్ ఓకే ప్లీస్' సినిమా షూటింగ్ సమయంలో నానా పాటేకర్ తనతో మిస్ బిహేవ్ చేశాడని తనుశ్రీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తనను లైంగికంగా వేధిస్తుంటే సెట్లో అందరూ చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ అతడిని అడ్డుకోలేదని తనుశ్రీదత్తా తెలిపారు.

గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో పాట చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పిన తనుశ్రీ దత్తా.... దర్శక నిర్మాతలు కూడా ఆ సమయంలో నానా పాటేకర్ డిమాండ్లకు తలొగ్గాలని సూచించారని ఆరోపించారు.

Recommended Video

Tanushree Dutta Has a Huge Change In Her Physic

అయితే తాజాగా ఓ వెబ్ సైట్‌తో కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య మాట్లాడుతూ... తనుశ్రీదత్తా చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇది చాలా పాత సంఘటన. అపుడు జరిగిన విషయాలు నాకు సరిగా గుర్తు లేవు. సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏదో గొడవ జరిగింది, మూడు గంటల పాటు షూటింగ్ ఆగిపోయింది. అపుడు చిన్న మిస్‌అడర్‌స్టాండింగ్ వల్ల అలా జరిగిందే తప్ప ఆమె పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేన్నారు.

Ganesh Acharya about Nana Patekar and Tanushree Dutta isuue

తన వల్లే ఆ సినిమాలో గణేష్ ఆచార్యకు అవకాశం వచ్చింది. కానీ అతడు నన్ను వెన్నుపోటు పొడిచి నానా పాటేకర్ వైపు నిలిచాడంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. దీనిపై గణేష్ ఆచార్య స్పందిస్తూ... అలాంటిదేమీ లేదని, నిర్మాత, దర్శకుడితో తనకు స్నేహం ఉంది కాబట్టే అందులో అవకాశం వచ్చిందన్నారు.

నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదు. నానాజీ చాలా స్వీట్ పర్సన్. ఆయన ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. ఆయన చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులకు సహాయం చేశారు. తనుశ్రీ దత్తా ఆరోపించినట్లు ఆయన అలాంటి పనులు చేసేవారు కాదని గణేష్ ఆచార్య అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X