WAR 2: ఆస్కార్‌పై ఎన్టీఆర్, హృతిక్ గురి.. వార్ 2 కోసం రంగంలోకి మరో ఇద్దరు స్టార్లు

గతంలో కంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీల్లోనూ మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ స్టార్లకు వేరే భాషల నుంచి ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు తెలుగు హీరోల కోసం క్యూ కడుతున్నారు. ఇలా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హిందీలో 'వార్ 2' అనే సినిమాలో నటిస్తోన్నాడు.

టాలీవుడ్‌లో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం.. గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన 'వార్' మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. దీన్ని అయాన్ ముకర్జీ తెరెక్కిస్తున్నాడు.

Ganesh Acharya and Jani Master Onboard for WAR 2 Movie Song

పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న 'వార్ 2' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా కొద్ది రోజుల పాటు జరిపిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్‌లో కూడా భాగం కాబోతున్నాడని టాక్ వచ్చేసింది.

టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల కలయికలో రూపొందుతోన్న 'వార్ 2' మూవీకి సంబంధించి ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై కీలకమైన సన్నివేశాలను త్వరలోనే షూట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో వీళ్లిద్దరిపై అదిరిపోయే మాస్ నెంబర్ సాంగ్‌ను పెడుతున్నారు. దీన్ని ఫస్ట్ లేదా సెకెండ్ షెడ్యూల్‌లో చిత్రీకరించబోతున్నారని తాజాగా న్యూస్ బయటకు వచ్చింది.

Ganesh Acharya and Jani Master Onboard for WAR 2 Movie Song

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'వార్ 2' మూవీలో ఈ మాస్ సాంగ్ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఏకంగా గణేష్ ఆచార్య, జానీ మాస్టర్లను కొరియోగ్రాఫర్లుగా ఎంపిక చేశారని సమాచారం. వీళ్లిద్దరూ కలిసి ఆస్కార్ రేంజ్ స్టెప్పులను కంపోజ్ చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అదే జరిగితే మరోసారి మన పాట వరల్డ్ రేంజ్‌కు వెళ్లడం ఖాయం అనే చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతోన్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది. ఇందులో ఆలియా భట్, కియారా అద్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలిసింది. దీన్ని వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ చేస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X