twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షారుఖ్ ఖాన్ ఇంట్లో గణేషుడి విగ్రహం.. అబద్ధం అనే వారికి క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో బాయ్ కాట్ అనే ట్యాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కొంతమంది అగ్ర హీరోలపై బాయ్ కాట్ బ్యాచ్ ఊహించని విధంగా ప్రభావం చూపిస్తోంది అనే చెప్పాలి. ఇటీవల వచ్చిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాపై ఆ ట్యాగ్ ఎంతగా ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత రాబోయే మరికొన్ని అగ్ర సినిమాలపై కూడా ఈ డామేజ్ ఉండే అవకాశం అయితే ఉంది.

    కానీ ముందు నుంచి కొంతమంది హీరోలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హిందువుల దేవుళ్లను బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని అగ్ర హీరోలు తప్పుగా చూపిస్తారు అని హిందూ సంప్రదాయాలను కించపరిచే విధంగా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఎప్పటినుంచో కొంతమంది అగ్ర హీరోలు మతాలతో సంబంధం లేకుండా ఇతర మతాలను కూడా గౌరవిస్తూ ఉంటారు. ఈ వరుసలో షారుక్ ఖాన్ కూడా ఉంటాడు. ఆయన భార్య గౌరీ ఖాన్ కూడా హిందూ సంప్రదాయాలను పాటిస్తారు.

    Ganesh idol at Shah Rukh Khan house latest pic viral

    అయితే ఈ క్రమంలో షారుఖాన్ ఇంట్లో ఇటీవల వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ప్రతిష్టించినట్లుగా అనేక రకాల కథనాలు వెలుపడ్డాయి. అయితే అది నిజం కాకపోవచ్చు అని సోషల్ మీడియాలో మరో టాక్ వైరల్ అవుతున్న సమయంలో షారుక్ ఖాన్ అంతకుముందే ఇన్స్టాగ్రామ్ లో వినాయకుడు విగ్రహం ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. తన కొడుకు సంతోషంగా పెట్టుకున్న వినాయకుడి విగ్రహం అంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

    దీంతో షారుఖాన్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ లో ఎలాంటి నిజం లేదు అని క్లారిటీ వచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో షారుఖ్ ఖాన్ నుంచి మూడు బిన్నమైన సినిమాలు రాబోతున్నాయి. ముందుగా అందరి ఫోకస్ అయితే పటాన్ సినిమా పైన ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. అందులో సల్మాన్ ఖాన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

    English summary
    Ganesh idol at Shah Rukh Khan house latest pic viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X