twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    21 శతాబ్ధపు ప్రపంచ ఉత్తమ చిత్రాల్లో ఒకే ఒక భారతీయ సినిమాకు స్థానం!

    |

    అనురాగ్ కశ్యప్ రూపొందించిన కల్ట్ మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' 21 వ శతాబ్దపు 100 ఉత్తమ చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. 'ది గార్డియన్' రూపొందించిన ఈ జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ చిత్రం ఇదే. తను రూపొందించిన యాక్షన్ డ్రామా ఈ లిస్టులో 59వ స్థానాన్ని దక్కించుకున్న విషయం వెల్లడిస్తూ కశ్యప్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు.

    "ఈ స్థానం దక్కినందుకు గర్వంగా ఉంది, కానీ ఇది నా జాబితా కాదు, నాకు ఇష్టమైన చాలా సినిమాలు నా చిత్రానికి దిగువ ఉండవు .. 'డార్క్ నైట్' ఈ జాబితాలోని నంబర్ 1 చిత్రంగా ఉండటంపై నేను పూర్తి ఏకీభవిస్తున్నాను, ఆ సినిమాకు అర్హత ఉంది.'' అని పేర్కొన్నారు.

     Gangs Of Wasseypur in The Guardian list of 100

    అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, నటి కల్కి కోచ్లిన్ అతడి పోస్టుపై స్పందిస్తూ... "అవును బాస్" అని వ్యాఖ్యానించారు. చిత్ర నిర్మాత హన్సాల్ మెహతా రియాక్ట్ అవుతూ "ఇప్పుడు మీరు అఫీషియల్ పోస్టర్ బాయ్!" అని పేర్కొన్నారు. 'ది గార్డియన్' బెస్ట్ 100 జాబితాలో పెర్సెపోలిస్, వాల్ట్జ్ విత్ బషీర్, కపెర్నౌమ్ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలు కూడాఉన్నాయి.

    రెండు చిత్రాలుగా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సిరీస్ 2012లో విడుదలైంది. జార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లాలోని వాస్సేపూర్ పట్టణంలో బొగ్గు మాఫియా కుటుంబ కథతో ఈ చిత్రం సాగుతుంది. ఈ రెండు చిత్రాలు మాస్ ప్రేక్షకుల ఆదరణ పొంది విజయం అందుకున్నాయి. ఈ గ్యాంగ్ వార్ డ్రామాలో మనోజ్ బాజ్‌పేయి, నవాజుద్దీన్ సిద్దిఖీ, పియూష్ మిశ్రా, రిచా చద్దా నటించారు.

    English summary
    Filmmaker Anurag Kashyap’s cult film Gangs Of Wasseypur has become the only Indian film to feature in The Guardian list of 100 Best Films of the 21st century.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X