twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Gangubai Kathiawadiకి షాక్.. మా అమ్మ పరువు తీశారు అంటూ కోర్టుకు.. వేశ్యగా చూపిస్తారా?

    |

    నటి అలియాభట్‌ నటించిన తాజా చిత్రం 'గంగూబాయి కతియావాడి' ఫిబ్రవరి 25న విడుదల కానుంది. దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా 'గంగూబాయి' పాత్రలో కనిపించబోతుంది, అయితే ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాలను చుట్టుముట్టింది. తాజాగా ఈ సినిమాపై గంగూబాయి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాపై కుటుంబ సభ్యులు కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ సినిమాలో తమ తల్లిని ఓ 'సామాజిక కార్యకర్త'గా కాకుండా వేశ్యగా మార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    వేశ్యల పిల్లలే

    వేశ్యల పిల్లలే


    సామాజిక కార్యకర్త అయిన మా అమ్మను సినిమాలో వేశ్యగా మార్చారని గంగూబాయి కుమారుడు బాబూరావు షా ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. 'సినిమాలో మా అమ్మను వేశ్యగా చూపిస్తున్నారు. ఇప్పుడు ఆమె గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈ విషయాలు మా కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు డబ్బుకు ఆశపడి సినిమా నిర్మాతలు నా కుటుంబం పరువు తీశారని గంగూబాయి మనవరాలు భారతి అన్నారు. దాన్ని అస్సలు అంగీకరించలేము. మేకర్స్ సినిమా తీయడానికి కుటుంబ సభ్యుల సమ్మతి కూడా తీసుకోలేదు, పుస్తకం కోసం మా వద్దకు ఎవరూ రాలేదు అని అన్నారు. మా అమ్మమ్మ కామాఠీపురలో నివసించారు, కాబట్టి అక్కడ నివసించే ప్రతి మహిళ వేశ్య అంటే ఎలా? అని చిత్ర నిర్మాతలపై భారతి విరుచుకుపడింది. మా అమ్మమ్మ అక్కడ నలుగురు పిల్లలను దత్తత తీసుకుంది, ఆ నలుగురూ వేశ్యల పిల్లలే అని భారతి పేర్కొంది.

    బయటకు వెళ్లడానికి కూడా

    బయటకు వెళ్లడానికి కూడా

    మా అమ్మ పేరు శకుంతల రంజిత్ కవి, రెండో కొడుకు పేరు రజినీకాంత్ రావ్ జీ షా, మూడో కొడుకు పేరు బాబు రావ్ జీ షా, నాల్గవ కూతురు పేరు సుశీలా రెడ్డి. మేము ఆమె కుటుంబం నుంచి వచ్చాము కానీ మేకర్స్ మమ్మల్ని అక్రమం అని అంటున్నారు. ఎందుకంటే మా అమ్మమ్మ దత్తత తీసుకున్నప్పుడు చట్టాలు లేవు అని ఆమె అన్నారు. భారతి ఇంకా మాట్లాడుతూ, 'ఒకవైపు, మేము మా అమ్మమ్మల కథలను ప్రజలకు గర్వంగా చెప్పాము. ఈ సినిమా ట్రైలర్‌ విడుదలయ్యాక మా కుటుంబం పరువు పోయింది. మీ అమ్మమ్మ వ్యభిచారి అని అందరూ చెప్పడం మొదలుపెట్టారు. మా అమ్మమ్మ తన జీవితాంతం కమాటిపుర ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధికి కృషి చేసింది. కానీ ఈ సినిమాను తెరకెక్కించినవారు మా అమ్మమ్మను వేశ్యను చేశారు. ప్రజలు ఇప్పుడు మమ్మల్ని వేశ్యల పిల్లలు అని పిలుస్తున్నారు. నేను మరియు మా కుటుంబం ఇప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నాము' అని పేర్కొన్నారు.

    కోర్టుకు వెళ్లాలని

    కోర్టుకు వెళ్లాలని


    జాతీయ మీడియా నివేదికల ప్రకారం, 'గంగూబాయి కతియావాడి' చిత్రం ట్రైలర్ విడుదలైన తర్వాత గంగూబాయి కుటుంబ సమస్యలు మరింత పెరిగాయి. ఆమె కుటుంబ సభ్యులు కూడా ముంబైలోని తమ ఇంటిని తరచుగా మార్చవలసి వస్తోందని చెబుతున్నారు. గంగూబాయి 1949లో నలుగురు పిల్లలను దత్తత తీసుకున్నారు, ఆ నలుగురితో మొదలైన కుటుంబం ఇప్పుడు వారికి పెళ్లిళ్లు అయి పిల్లలతో కలిసి 20 మంది సభ్యులు ఉన్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా జీవిస్తున్న గంగూబాయి కుటుంబ సభ్యులను ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడంతో సమాజం ప్రశ్నల వర్షం కురిపించింది. అంతేకాదు గంగూబాయి మీద ఎలాంటి పుస్తకం ఉందొ కూడా ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు. నిత్యం ప్రజల్లో అవమానాలు ఎదుర్కొంటున్న గంగూబాయి కొడుకు.. తన తల్లి, కుటుంబ పరువు కాపాడేందుకు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుని ముంబై కోర్టులో స్టే కొరారు. దీనిపై సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసిన ముంబయి కోర్టు

     లేడీ మాఫియా డాన్‌గా

    లేడీ మాఫియా డాన్‌గా


    గంగూబాయి కుటుంబ న్యాయవాది నరేంద్ర జాతీయ మీడియాతో మాట్లాడుతూ, 'చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుండి గంగూబాయి కుటుంబం మొత్తం షాక్‌లో ఉంది. సినిమాలో తన తల్లి గంగూబాయి జీవితాన్ని పూర్తిగా తప్పుగా చిత్రీకరిస్తున్నారని, సినిమా అంతా నిరాధారమైనదని కూడా ఆయన పేర్కొన్నాడు. ఒక సామాజిక కార్యకర్తను వేశ్యగా ప్రొజెక్ట్ చేస్తే ఏ కుటుంబం అది ఇష్టపడుతుంది? ఆమెను వ్యాంప్, లేడీ మాఫియా డాన్‌గా చూపిస్తున్నారని అన్నారు. ఇక్కడ మన వ్యవస్థ ఎలా ఉందంటే ఇంటి పరువును బహిరంగంగా వేలం వేస్తుంటే తమ పరువును కాపాడుకునే బదులు కొడుకును ఆమె కొడుకు అని రుజువు చేయమని అడుగుతున్నారని, దిగువకోర్టులో నిరూపించినా ఇప్పుడు మా కేసులో తదుపరి విచారణ జరగలేదని అన్నారు.

     ఎలాంటి స్పందన రాలేదని

    ఎలాంటి స్పందన రాలేదని

    2020 నుండి గంగూబాయి కుటుంబ సభ్యుల మధ్య ఈ గొడవ ప్రారంభమైందని, వారి కొడుకు తన తల్లిపై పుస్తకం వచ్చిందని, సినిమా కూడా తీస్తున్నారని తెలియడంతో తనను సంప్రదించారని లాయర్ అన్నారు. మీ అమ్మ నిజంగా వ్యభిచారి కదా అని ప్రజలు ఆమె కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రజల ప్రశ్నలు వినలేక వారు తరచుగా ఇల్లు మారాల్సి వస్తోందని పేర్కొన్నారు. సంజయ్ లీలా భన్సాలీకి, రచయిత హుస్సేన్ జైదీకి కూడా నోటీసులు పంపామని అయితే దీనిపై ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నారు. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి'లో అలియాతో పాటు అజయ్ దేవగన్, విజయ్ రాజ్, సీమా పహ్వా కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా కథ హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం నుంచి తీసుకున్నారు.

    English summary
    Gangubai Kathiawadi faces legal trouble as her family seeks stay on film's release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X