కరోనా పాజిటివ్‌తో షూటింగుకు రాలేదు.. వార్తలన్నీ రూమర్లే.. గౌహర్ ఖాన్ టీమ్ ఖండన
కరోనా పాజిటివ్‌తో షూటింగులో పాల్గొన్నారనే ఆరోపణలపై బిగ్‌బాస్ ఫేమ్ గౌహర్ ఖాన్‌పై బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆమె సన్నిహితులు, సినిమా యూనిట్ స్పందించారు.
గౌహర్ ఖాన్ టీమ్ స్పందిస్తూ.. ఆమెకు కరోనాపాజిటివ్ అనే వార్త అవాస్తవం. ఆమె తన అంకితభావంతో షూటింగుకు వచ్చారు. గౌహర్ ఖాన్‌కు సంబంధించిన కరోనా నెగిటివ్ రిపోర్టులు మీకు అందజేస్తున్నాం అంటూ మీడియాకు వెల్లడించారు.

గౌహర్ ఖాన్‌కు నిబంధనలు పాటించడం తెలుసు. ఆమె చట్టాలను గౌరవించే పౌరురాలు. బీఎంసీ రూల్స్‌ను గౌరవిస్తూ షూటింగులో పాల్గొన్నారు. ఇలాంటి రూమర్లకు ఇక చెక్ పెట్టండి అంటూ టీమ్ సూచించింది.
అంతకుముందు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తీవ్రంగా స్పందిస్తూ గౌహర్ ఖాన్‌పై కేసు నమోదు చేశారు. సెలబ్రిటీల కంటే నగర భద్రతే ముఖ్యం అంటూ ఘాటుగా స్పందించారు. దాంతో ఈ విషయం మీడియాలో వివాదంగా మారింది.


Click it and Unblock the Notifications











