Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దర్శకుడిపై #మీటూ ఆరోపణలు.... అయినా అతడితో డేటింగ్ చేస్తోంది?
క్వీన్, చిల్లర్ పార్టీ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వికాష్ బహల్ ప్రస్తుతం హృతిక్ రోషన్ హీరోగా 'సూపర్ 30' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ దర్శకుడిపై కొన్ని రోజులుగా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. #మీటూ ఉద్యమం తెరపైకి వచ్చిన తర్వాత వికాస్ బహల్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫాంటమ్ ఫిల్మ్స్‌లో పని చేసిన ఓ మహాళా ఉద్యోగి అతడి వ్యవహారం బయటపెట్టింది. వికాస్ మీద అలాంటి ఆరోపణలు వచ్చినా పట్టించుకోకుండా ఓ బాలీవుడ్ బ్యూటీ అతడితో డేటింగ్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
బిగ్ బస్ 7 విన్నర్ గౌహర్ ఖాన్
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం బిగ్ బాస్ 7 విన్నర్ గౌహర్ ఖాన్ వికాస్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నారని, కలిసి ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నారని టాక్.
పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!
అతడికి సపోర్టుగా...
వికాస్ #మీటూ ఆరోపణల వలయంలో చిక్కుకున్న తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది అతడిని దూరం పెడుతున్నారు. అయితే అంతకు ముందే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వికాస్-గౌహర్ మధ్య పరిచయం ఏర్పడింది. తనపై వచ్చిన ఆరోపణలతో కృంగిపోయిన వికాస్‌కు గౌహర్ ఖాన్ సపోర్టుగా ఉంటూ అతడికి మరింత దగ్గరవుతుందని చర్చించుకుంటున్నారు.
ఇంట్లో, ఆఫీసులో...
ఇద్దరి మధ్య ఎంత క్లోజ్ రిలేషన్ ఏర్పడిందంటే... వికాస్ ఇల్లు, ఆఫీసు ఇలా ఎక్కడ చూసినా తరచూ ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తున్నారు. దీంతో వారి మధ్య రిలేషన్ బలపడుతోందనే వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది.
కోర్టు వరకు వెళ్లిన వ్యవహారం
వికాస్ బహల్‌తో కలిసి అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వానీ గతంలో ‘ఫాంటమ్ ఫిల్మ్స్'లో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరి మధ్య విబేధాలు రావడంతో సంస్థను రద్దు చేసి విడిపోయారు. అయితే తనపై మీటూ ఆరోపణలు రావడం వెనక అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వానీ హస్తం కూడా ఉందని వికాస్ బహల్ అనుమానం. వీరిపై వికాస్ 10 కోట్ల పరువు నష్టం కేసు వేశారు.