Gauri Khan: డ్రగ్స్ కేసులో కొడుకు అరెస్ట్ పై తొలిసారి స్పందించిన గౌరీ ఖాన్..

డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, హోస్ట్​గా సక్సెస్​ఫుల్​ అయ్యాడు కరణ్​ జోహార్. ఇక ఇతను వ్యాఖ్యతగా వ్యవహరించే కాఫీ విత్ కరణ్​ టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఈ షోలో సెలబ్రిటీలను తన పిలిచి వారిపై ప్రశ్నలు కురిపిస్తాడు. తిరకాసు క్వశ్చన్స్ వేసి వివిధ రకాలుగా రోస్ట్​ చేస్తాడు. అది ఎలాంటి ప్రశ్న అయిన నిర్మొహమాటంగా అడిగేస్తాడు. ఈ షోకు వచ్చేందుకు సెలబ్రిటీలు కూడా వెనుకాడరు. తాజాగా ఈ షోలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ సందడి చేసింది. తొలిసారిగా తన కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై ఆసక్తికరంగా స్పందించింది.

తొలిసారిగా..

తొలిసారిగా..

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు ఎంత సెన్సేషన్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేసులో గతేడాది అర్యన్ ఖాన్ ను ఎన్ సీ బీ అరెస్ట్ చేసింది. ఈ మధ్యనే ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా తన కుమారుడి కేసు గురించి పాపులర్ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ షోలో స్పందించింది గౌరీ ఖాన్.

పేరు ప్రస్తావించకుండా..

పేరు ప్రస్తావించకుండా..

ప్రోడ్యూసర్ అండ్ డైరెక్టర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షో ఏడో సీజన్ లో సందడి చేసింది షారుక్ ఖాన్ భార్య, ఆర్యన్ ఖాన్ తల్లి గౌరీ ఖాన్. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్యన్ ఖాన్ పేరు ప్రస్తావించకుండా ఆ కేసు గురించి ప్రస్తావించాడు కరణ్ జోహార్. దానికి చాలా ఎమోషనల్ గా సమాధానమిచ్చింది గౌరీ ఖాన్.

చాలా గొప్ప విషయం..

చాలా గొప్ప విషయం..


''కేవలం వత్తిపరంగానే కాదు. వ్యక్తిగతంగాను మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారు కదా. కానీ, మీరు కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కున్నారు. మళ్లీ స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఇదంత సులువు కాదని నాకు తెలుసు. మనమంతా ఒకే కుటుంబం. నేను మీ పిల్లలకు దేవుడు ఇచ్చిన తండ్రిలా భావిస్తాను. అయితే మీరు ఈ సంక్షోభం నుంచి బయట పడటం చాలా గొప్ప విషయం. ఆ చేదు అనుభవాల గురించి మీరేం చెబుతారు?'' అని కరణ్ జోహార్ అడిగాడు.

ఓ కుటుంబంగా నిలబడ్డాం..

ఓ కుటుంబంగా నిలబడ్డాం..

దీనికి ''అవును. మా జీవితంలో ఇంత దారుణమైన రోజుల్ని ఇప్పటివరకు చూడలేదు. ఓతల్లిగా నేనెంత మానసిక వేదన అనుభవించానో నాకు తెలుసు. కానీ, ఇవాళ మేం కలిసికట్టుగా ఓ కుటుంబంగా నిలబడ్డాం. మాపై అందరూ ప్రేమను చూపించారు'' అని గౌరీ ఖాన్ సమాధానం ఇచ్చారు. అలాగే ''నాకు తెలియని వాళ్ల నుంచి నాకు ఎన్నో మెసేజ్ లు వచ్చాయి. అలాంటి వాళ్లు మాకు దొరకటం మా అదృష్టం. కష్టకాలంలో మాకు ఎంతగానో సహకరించారు'' అని పేర్కొంది.

కాలిఫోర్నియాలో గ్యాడ్యుయేషన్

కాలిఫోర్నియాలో గ్యాడ్యుయేషన్

కాగా ఆర్యన్ ఖాన్ సౌత్ కాలిఫోర్నియాలో గ్యాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. గతేడాది ముంబై కోర్డేలియా క్రూయిజ్ఎంప్రెస్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ బయట పడింది. ఈ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు 2021 అక్టోబర్ లో అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆర్యన్ ఖాన్ పట్టుబడిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X