Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నేను 3 గంటలు.. ఆయన 6 గంటలపాటు.. అంటూ షారుక్ సీక్రెట్ బయటపెట్టిన గౌరీఖాన్
బాలీవుడ్లో సినీ తారల బ్రేకప్ వార్తలకు కొదువ ఉండవు. సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పుడు ఏదో ఒక గాసిప్స్ హడావిడి చేస్తుంటుంది. అలాంటి వాటికి దూరంగా ఉండే జంటల్లో షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ జంటకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత 27 ఏళ్లుగా బలమైన వైవాహిక బంధాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. ఇలాంటి నేపథ్యంతో ముంబైలో షారుక్, గౌరీఖాన్ మోస్ట్ స్టయిలీష్ కపుల్ అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సీక్రెట్‌ను గౌరీ ఖాన్ వెల్లడించారు. అదేమిటంటే...
షారుక్ ఖాన్ పార్టీకి వెళ్లేటప్పుడు
షారుక్ ఖాన్ డ్రెస్పింగ్ చాలా రొటీన్‌గా ఉంటుంది. ఇతరులకు చెప్పేటప్పుడు స్టయిల్‌తో పనేముంది అంటాడు. సాధారణంగా తయారు కావడానికి 20 నిమిషాలు తీసుకొంటాడు. అయితే ఏదైనా పార్టీకి వెళ్లే సమయంలో గంటల కొద్ది ముస్తాబవుతాడు అని గౌరీ ఖాన్ వెల్లడించింది.
మూడు గంటలపాటు డ్రెస్పింగ్ కోసం
ఇక ప్రత్యేకంగా ఏదైనా పార్టీకి హాజరవ్వలానుకొంటే స్పెషల్‌గా, స్టయిలీష్‌గా తయారు అవుతాడు. కనీసం రెండు నుంచి మూడు గంటలపాటు డ్రిస్సింగ్కు, తయారు కావడానికి సమయాన్ని కేటాయిస్తాడు అని గౌరీఖాన్ చెప్పింది.
నేను మూడు గంటలు.. ఆయన ఆరుగంటలు
మోస్ట్ స్టయిలీష్ అవార్డు అందుకోవడానికి మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సమయం తీసుకొన్నారనే ప్రశ్నకు గౌరీ సమాధానం ఇస్తూ.. ఈ రోజు నేను ఎక్కువ సమయం తీసుకొన్నాను. నేను రెడీ కావడానికి 3 గంటలు తీసుకొన్నాను. కానీ షారుక్ ఖాన్ 6 గంటలు కేటాయించాడు అని చెప్పడంతో వేదికంతా నవ్వులతో మునిగిపోయింది.
29 ఏళ్లుగా అన్యోన్య దంపతులుగా
1991లో షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. 29 ఏళ్లుగా అన్యోన్యయంగా జీవిస్తున్నారు. వారికి అబ్రామ్, సుహానా, ఆర్యన్ ముగ్గురు సంతానం ఉన్నారు. తాను హీరోగా కావడానికి ప్రయత్నిస్తున్నప్పటి నుంచి వారిద్దరూ అఫైర్‌లో ఉన్నారు. షారుక్ స్టార్ హీరోగా మారిన తర్వాత గౌరీ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.