Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ నిర్మాణం... సొంత వ్యాపారం...ఇప్పుడు రచయిత్రి... గౌరీఖాన్ ప్రాస్థానం
గౌరీఖాన్ అంటే ఠక్కున తెలుగువారికి తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముద్దుల భార్యామణి అంటే వెంటనే అర్ధమైపోతుంది. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ పేరు బాగా వినిపిస్తుంది. ఎందుకంటే షారుఖ్ భార్యగా కన్నా ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.
షారుఖ్ ఖాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన గౌరీ ఖాన్, క్రమంగా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగింది. అనంతరం హృతిక్ భార్య సుజానే ఖాన్ తో కలసి ఇంటీరియర్ డిజైనింగ్ స్టూడియో ప్రారంభించింది. ఎందరో ప్రముఖులకు ఇంటిని డిజైన్ చేసి ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో అవతారం ఎత్తబోతోంది గౌరీ.
లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అయిన గౌరీఖాన్, ఇంటీరియర్ డిజైనింగ్ వ్యాపారం కూడా పడకేయడంతో ఈ రంగంలో తన అనుభవాలను పుస్తక రూపం ఇవ్వాలని భావించింది. అనుకున్నదే తడువు చకచకా పేపర్ పెన్ను పట్టుకుని తన మనసులోని మాటలన్నీ కాగితం పై గుమ్మరించేసింది. త్వరలోనే ఓ ప్రముఖ పబ్లిషింగ్ హౌస్ కాఫీ టేబుల్ బుక్ గా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించబోతోంది.
మై లైఫ్ ఇన్ డిజైన్ పేరిట గౌరీ ఖాన్ రాసిన ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసేందుకు ముందుకు వచ్చిన పెంగ్విన్ రాండమ్ హౌస్ 2021లో దీన్ని జనాల్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంటీరియర్ డిజైనర్ గా గౌరీ ప్రయాణం ఎలా సాగింది, ఆమె ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది అన్న విషయాలన్నీ ఇందులో పొందుపరచినట్లు తెలుస్తోంది. మరి నిర్మాతగా, డిజైనర్ గా తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకున్న గౌరీ, ఇప్పుడు రచయిత్రగానూ ఆకట్టుకోవాలని ఆశిద్దాం.