సొంత మరదలితోనే అలాంటి చిత్రం.. రాజ్ కుంద్రా లీలల్ని బయటపెట్టిన టాప్ మోడల్
పోర్న్ రాకెట్ కేసులో వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. Hot Hit, HotShots అనే యాప్స్ ద్వారా పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను అప్‌లోడ్ చేస్తున్న కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో మొట్టమొదటిసారి ముంబై పోలీసులు విచారించిన మోడల్ గెహ్నా వశిష్ట్ తాజాగా రాజ్ కుంద్రాపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఆ ఆరోపణల విషయంలోకి వెళ్తే..

బాలీ ఫేమ్ యాప్‌లో
రాజ్ కుంద్రా మరో యాప్‌ను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ హిందీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజ్ కుంద్రా అరెస్ట్‌కు కొద్ది రోజుల ముందు నేను ఆయన ఆఫీస్‌కు వెళ్లి కలిశాను. ఆ సందర్బంగా Bollyfame అనే కొత్త యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు నాకు తన ప్లాన్స్‌ను వివరించారు అని గెహ్నా వశిష్ట్ వెల్లడించారు.

షమితాశెట్టితో సినిమా
Bollyfame యాప్ ద్వారా చాట్ షోలు, రియాలిటీ షోలు, మ్యూజిక్ షోలు, వీడియోలు, సినిమాలు రూపొందించేందుకు ప్లాన్ చేశారు. ఇందులో బోల్డ్ సినిమాలు లేకుండా తీస్తానని చెప్పారు. తన మరదలు, శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి సాయి తమ్‌హంకర్, మరో ఇద్దరు ఆర్టిస్టులను ఎంపిక చేసుకొన్నారు. కొన్ని స్క్రిప్టులను వినిపించారు. అందులోని ఓ స్క్రిప్టులో షమితాను పెట్టి సినిమా తీయాలని అనుకొన్నారు. నన్నుడైరెక్ట్ చేయమని అడిగారని గెహ్నా వశిష్ట్ చెప్పారు.

చట్టం తన పని తాను చేసుకుపోతుందని
అయితే తాను షమితా శెట్టిని కలువలేదు. ఆమె రెమ్యునరేషన్, ఆ సినిమా గురించిన ఇతర విషయాలను చర్చించలేదని తెలిపారు. అంతేకాకుండా రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత చట్టం తన పని తాను చేసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. పోర్న్, బోల్డ్ కంటెంట్‌ను మిక్స్ చేసి చూడవద్దని ముంబై పోలీసులను గెహ్నా వశిష్ట్ కోరారు. ఈ దందాలో ఎవరు నిజమైన నేరస్థులో కోర్టు విచారణలో తేలుతుంది అని అన్నారు.

మిస్ ఏషియా బికినీ విన్నర్‌గా
గెహ్నా వశిష్ట్ విషయానికి వస్తే.. ఆమె మిస్ ఏషియా బికినీ విన్నర్‌గా సుపరిచితులు. పోర్న్ రాకెట్ కేసులో ఆమెను కస్టడీలోకి తీసుకొని తొలిసారి ముంబై క్రైమ్ విభాగానికి చెందిన ప్రాపర్టీ విభాగం విచారించింది. గంధీ బాత్ అనే వెబ్ సిరీస్ ద్వారా గెహ్న మంచి పాపులారిటీని సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత ఈ కేసులో విచారించడంతో అందరి దృష్టి ఆమెపై పడింది.
Recommended Video


70 వీడియోలపై విచారణ
ఇదిలా ఉండగా, దాదాపు 70 వీడియోలు ప్రొడ్యూస్ చేసినట్టు రాజ్ కుంద్రాపై ఆరోపణలు వస్తున్నాయి. ఆ వీడియోలను ముంబై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ వీడియోలను రూపొందించిన సంస్థలకు సమన్లు జారీ చేసి ఆ సంస్థ ఉద్యోగులను విచారిస్తున్నారు. జూలై 23 నాటికి పోలీస్ రిమాండ్ ముగియడంతో రాజ్ కుంద్రాను కోర్టులో హాజరుపరిచారు. ఆయనను జూలై 27 వరకు పోలీస్ రిమాండ్ తరలిస్తూ కోర్టు నిర్ణయం తీసుకొన్నది.


Click it and Unblock the Notifications











