Gehraiyaan: శృంగార సన్నివేశాలపై దీపికా షాకింగ్ రియాక్షన్.. అమ్ముకునే రకం కాదంటూ..
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొన్ ఇటీవల డిఫరెంట్ రొమాంటిక్ డ్రామా గెహ్రియాన్ అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రశంసల కంటే కూడా విమర్శలతో కాంట్రవర్సీ ఎక్కువ అవుతోంది. చాలామంది సోషల్ మీడియాలో దీపికా రొమాన్స్ పై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమాతో వ్యాపారం కాబట్టే అలాంటి సీన్స్ ఉన్నాయని కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఆ విమర్శలకు దీపికా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

టైమ్ వేస్ట్ అంటూ..
దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా నటించిన గెహ్రీయాన్ సినిమాకు విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను అందుకుంటుంది. కొందరు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఉందని అంటుంటే, మరికొందరు మాత్రం సినిమాకు శకున్ బాత్రా దర్శకత్వం వహించడం 'టైమ్ వేస్ట్' అని అన్నారు. వీటన్నింటి మధ్య, సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

అక్రమ సంబంధం..
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఎదో ఒక కొత్త తరహా పాయింట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. పాత్ర ఎలాంటిదైనే సరే తనకు నచ్చితే మాత్రం లీనమై నటిస్తుంది. గతంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసిన దీపికా గెహ్రియాన్ సినిమాలో మాత్రం షాక్ ఇచ్చే పాత్రలో నటించింది. ఏకంగా తన కజిన్ బాయ్ ఫ్రెండ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళగా ఆమె చేసిన పాత్ర నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది.

రణ్ వీర్ రియాక్షన్
ఇక దీపికా చేసిన ఆ పాత్రపై విడుదలకు ముందు నుంచే అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా దారుణమైన ట్రోల్స్ వెలువడుతున్నాయి. ఆఖరికి ఆమె భర్త రణ్ వీర్ సింగ్ ను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఆమె చేసిన ఇంటిమెట్ సీన్స్ పై రణ్ వీర్ కూడా పాజిటివ్ గానే స్పందించాడు. దీపికా చాలా అద్భుతంగా నటించింది అని కొనియాడాడు.

సెల్లింగ్ పాయింట్ కాదు..
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మరోసారి ట్రోలింగ్ కు కౌంటర్ ఇచ్చే విధంగా స్పందించింది. సాన్నిహిత్యంగా కనిపించే సన్నివేశాలు సెల్లింగ్ పాయింట్ కాదని ఆమె చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
సాన్నిహిత్యంగా ఉండే సన్నివేశాలు సినిమా సెల్లింగ్ పాయింట్ కాదని చెప్పింది. సినిమాలో ఇంకా చాలా కంటెంట్ ఉందని.. సాన్నిహిత్యంగా ఉండే సన్నివేశాలపై చర్చ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుందని చెప్పింది. అలాంటి రొమాన్స్ బోల్డ్ సన్నివేశాలు సినిమాకి అమ్ముడుపోయే అంశం కాదని సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఆ విషయాన్ని గుర్తిస్తారని కూడా చెప్పింది.
Recommended Video

అలా చూపించేందుకు..
సినిమాలో ఇంటిమేట్ సీన్స్ అనేవి పాత్రలకు అలాగే వారి ప్రయాణానికి మధ్యలో వచ్చే అంశాలు మాత్రమే అంటూ నిజ జీవితంలోని అంశాలను భావోద్వేగాలను పర్ఫెప్ట్ గా చూపేందుకు ఒక ఉదాహరణ మాత్రమే అని దీపికా మరొక వివరణ ఇచ్చింది. ఇక ఫైనల్ గా సినిమాలో ప్రతీ సన్నివేశం మనసు పెట్టి చేసింది అంటూ సహా నటులతో ముందుగా ప్రిపేర్ చేసిన తరువాతనే ఆ రొమాంటిక్ సీన్స్ లో నటించడం జరిగిందని కూడా దీపికా తెలియజేసింది.


Click it and Unblock the Notifications











