twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ ‘బొమ్మరిల్లు’కు మోక్షం.. ఓటీటీ పుణ్యమా అని అలా రాబోతోంది!

    |

    తెలుగు సినిమా కథలు బాలీవుడ్‌ను ఏలేస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ ఎప్పటి నుంచో నడుస్తున్న ఫార్మూలా అక్కడ ఇప్పుడు వర్కవుట్ చేస్తున్నారు. మాస్, కమర్షియల్ అంటూ మన కథలను అక్కడికి ఎగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మన తెలుగు కథలు అక్కడి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేశాయి. అయితే బొమ్మరిల్లు సినిమా తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. సినిమా వచ్చి దాదాపు పద్నాలుగేళ్లు అవుతున్నా కూడా ఇంకా జనాల నోళ్లల్లో నానుతూనేఉంది.

    అలాంటి బొమ్మరిల్లు సినిమాను హిందీలోనూ రీమేక్ చేశారు. జెనీలియాను హీరోయిన్‌గా పెట్టి హర్మాన్ బవేజాతో ఇట్స్ మై లైఫ్ అంటూ రీమేక్ చేశారు. 2007లోనే ఈ సినిమా పూర్తయింది. కానీ ఇంత వరకు విడుడలకు నోచుకోలేదు. కరోనా లాక్ డౌన్ ఓటీటీ పుణ్యమా అని ఇలా మూలన పడ్డ సినిమాలన్నీ తెర మీదకు వస్తున్నాయి. ఈ సినిమాని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు.

    Genelia DSouza Harman Baweja It’s My Life On 29th November

    తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన వచ్చింది. జీ సినిమా యాప్‌లో ఈ మూవీ విడుదల కాబోతోంది. నవంబర్ 29న ఈ మూవీ రిలీజ్ కానుంది. ప్రకాష్ రాజ్ పాత్రలో నానా పటేకర్ జీవించినట్టు కనిపిస్తోంది. బొమ్మరిల్లు ఫాదర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ముద్ర వేసిందో అందరికీ తెలిసిందే. నానా పటేకర్ కూడా తన దైన శైలిలో ఆపాత్రను పండించినట్టు కనిపిస్తోంది.

    English summary
    Genelia D'Souza Harman Baweja It’s My Life On 29th November.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X