twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ చిత్రాంగద సింగ్ మాజీ భర్త అరెస్ట్.. చేతిలో తుపాకీ, తీవ్రమైన నేరం!

    |

    బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కృష్ణజింకల కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు సందర్భాల్లో బెయిలు తో బయటపడ్డ సల్మాన్ ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. సల్మాన్ ఖాన్ వివాదాన్ని మరువక ముందే మరో సెలెబ్రిటీ అజావి జంతులని వేటాడిన కేసులో చిక్కుకున్నాడు. అతడెవరో కాదు బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్ మాజీ భర్త జ్యోతి రంధవ. జ్యోతి రంధవ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన గోల్ఫ్ క్రీడా కారుడు. అడవి మృగాలని వేటాడిన కేసులో జ్యోతి రంధవ అరెస్ట్ కావడం సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతోంది.

    గోల్ఫ్ క్రీడాకారుడిగా

    గోల్ఫ్ క్రీడాకారుడిగా

    పలు సందర్భంలో రంధవ టాప్ 100 ర్యాంకింగ్ లో కొనసాగాడు. గోల్ఫ్ క్రీడలో రంధవ 2004, 2009 మధ్య కాలంలో అత్యుతమ ప్రదర్శన కనబరిచాడు. 2001 లో చిత్రాంగద సింగ్, జ్యోతి రంధవ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. దశాబ్దానికి పైగా కలసి ఉన్న ఈ జంట 2014 లో విభేదాల కారణంగా విడిపోయారు. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

     దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్

    దుద్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్

    నేటి ఉదయం రంధవ ఉత్తరప్రదేశ్ లోని దుధ్వా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పోలీసులకు పట్టుబట్టలు తెలుస్తోంది. ఆ సమయంలో రంధావ తోడేళ్ళు, మరికొన్ని జంతువులని వేటాడుతున్నట్లు కేసు నమోదు చేసిన ఫారెస్ట్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. రంధవ నుంచి పోలీసులు ఏ22 తుపాకీ, తోడేలు చర్మం, వాహనం, వేటాడే కొన్ని వస్తువులని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రంధవ అరెస్ట్ తో సినీ రాజకీయ వర్గాలు షాక్ కి గురవుతున్నాయి.

    సాధారణమైన కేసు కాదు

    సాధారణమైన కేసు కాదు

    అడవి మృగాలని వేటాడడం అనేది సాధారణమైన కేసు కాదు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత 20 ఏళ్లుగా ఈ కేసు వలన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రంధవకు ఈ కేసు వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రంధవ 1994లో గోల్ఫ్ ఆటగాడిగా కెరీర్ ని ప్రారంభించాడు. పలు సందర్భాల్లో రంధవ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

    పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోనే

    పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోనే

    రంధవ సొంతరాష్ట్రం ఉత్తర ప్రదేశే. 1972లో లఖిమ్ పూర్ ఖేరి జిల్లాలో రంధవ జన్మించాడు. రంధవ తండ్రి ఆర్మీ మాన్ కావడంతో వీరికి ఉత్తర ప్రదేశ్ లో ఇల్లు కూడా ఉంది. గోల్ఫ్ ఆటగాడిగా కెరీర్ ప్రారంభించాక రంధవ ఢిల్లీలో నివాసం ఏర్పరుచుకున్నాడు. తాజాగా వేట కోసం అని ఉత్తర ప్రదేశ్ వెళ్లినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ జరిగిన తరువాత రంధవని కోర్టులో హాజరు పరుస్తాం అని పోలీసులు చెబుతున్నారు.

    English summary
    Golfer Jyoti Randhawa arrested on poaching charges in Uttar Pradesh Jyoti Randhawa, 46, ranked in the top 100 of the Official World Golf Ranking several times between 2004 and 2009.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X