twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రంగీలా రాజా’... ఈ మూవీ ఎవరి జీవితం ఆధారంగా వస్తుందో తెలుసా?

    By Bojja Kumar
    |

    విజయ్ మాల్యా... ఈ పేరు వినగానే మద్యం వ్యాపారం, కింగ్ ఫిషర్ బికినీ క్యాలెండర్లు, జల్సా జీవితం గడిపిన కోటీశ్వరుడు గుర్తుకు వస్తాడు. మద్యం వ్యాపారంతో అంచెలంచెలుగా ఎదిగి ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థను స్థాపించి వార్తల్లోకి ఎక్కిన ఈ కేటుగాడు తర్వాత బ్యాంకులకు రూ. 9వేల కోట్లకుపైగా పంగనామం పెట్టి దేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. మాల్యా జీవితం ఆధారంగా ఓ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెన్సార్‌ బోర్డు మాజీ చీఫ్‌, దర్శకుడు పహ్లజ్‌ నిహ్లానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

    బయోపిక్‌ తీసేంత గొప్పవాడా?

    బయోపిక్‌ తీసేంత గొప్పవాడా?

    ప్రజలకు ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తులు, మహానుభావుల గురించి బయోపిక్‌లు రావడం ఇప్పటి వరకు చూశాం. విజయ్ మాల్యా లాంటి ఆర్థిక నేరస్థుడిపై బయోపిక్ తీస్తుండటంపై పలువురు విస్మయం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది బయోపిక్ కాదని, అతడు చేసిన బ్యాంక్ స్కామ్‌లను ఫోకస్ చేస్తూ ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

    సినిమాలో ఏం చూపించబోతున్నారు?

    సినిమాలో ఏం చూపించబోతున్నారు?

    విజయ్ మాల్యా చేసిన బ్యాంకు మోసాలను ఫోకస్ చేస్తూ వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామనీ దర్శకుడు పహ్లజ్‌ నిహ్లానీ వెల్లడించారు. మాల్యా లగ్జరీ లై‌ఫ్‌‌లో కొన్ని ఘట్టాల ఆధారంగా చిత్రం తీస్తున్నట్లు వెల్లడించారు.

    మాల్యా పాత్రలో ఎవరు?

    మాల్యా పాత్రలో ఎవరు?

    మాల్యా పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవింద నటిస్తున్నారు. ఇందులో గోవింద గెటప్‌ చూసి అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతారని, అతడి పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తుందని వెల్లడించారు.

     రంగీలా రాజా

    రంగీలా రాజా

    ఈ చిత్రానికి ‘రంగీలా రాజా' అనే పేరు పెట్టబోతున్నట్లు పహ్లాజ్ నిహ్లానీ వెల్లడించారు. గోవింద ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడని, ముగ్గురు కొత్త హీరోయిన్లను ఈ మూవీ ద్వారా పరిచయం చేయబోతున్నామన్నారు.

     కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్స్‌ కాన్సెప్టుతో పాట

    కింగ్‌ఫిషర్ క్యాలెండర్ మోడల్స్‌ కాన్సెప్టుతో పాట

    మాల్యాకు బాగా పేరు తెచ్చిన కింగ్‌ఫిషర్ క్యాలెండర్ ఆధారంగా ‘రంగీలా రాజా' చిత్రంలో బికినీ భామలతో సాంగ్ సీక్వెన్స్ ఉంటుందని పహ్లాజ్ నిహ్లానీ తెలిపారు. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామన్నారు.

    English summary
    Producer and former Central Board of Film Certification chairperson Pahlaj Nihalani is directing a film based on fugitive businessman Vijay Mallya with Govinda is in the lead, ANI reported. The actor has a double role, and three new heroines will be launched in the movie, which has been titled Rangeela Raja, Nihalani said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X