మినిస్టర్ కూతురితో 20 రోజులు గడిపిన స్టార్ హీరో.. ఆమెకు తెల్లార్లు కావాల్సిందే

ఇండియాలో నటీనటులను అభిమానులు దేవుళ్లలా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. వారిని కనీసం దూరం నుంచి చూసినా చాలని పొంగిపోయే వారెందరో. తమ అభిమాన తారల కోసం భారీగా సామాజిక కార్యక్రమాలు చేపట్టేవారు కొందరైతే, వారి పేర్లు, ఫోటోలను పచ్చబొట్లుగా పొడిపించుకునే పిచ్చి అభిమానులు ఎందరో. టాలీవుడ్ టూ బాలీవుడ్ అడుగడుగునా ఇలాంటి వారు కనిపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ హీరో ఇంట్లో జరిగిన చర్చనీయాంశమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

కామెడీతో స్టార్ ఇమేజ్
కపూర్‌లు, చోప్రాలు, ఖాన్‌ త్రయం హిందీ చిత్ర పరిశ్రమను ఏలేస్తున్న సమయంలో బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్ధానం సంపాదించి అగ్రనటుడిగా ఎదిగారు గోవిందా. లవ్, యాక్షన్ సినిమాల వైపు కాకుండా తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేశారు ఈ హీరో. ఆయన అసలు పేరు గోవింద్ అరుణ్ అహుజా. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమ్‌ను గోవిందగా మార్చుకున్నారు.

Govinda s wife Sunita Ahuja revealed a minister s daughter stayed with them for 20 days

ఫ్యామిలీ స్టార్‌గా క్రేజ్
1986లో లవ్ 86 మూవీ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన గోవిందా .. హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. షోలా ఔర్ షబ్నమ్, ఆంకెన్, రాజా బాబు, కూలీ నెంబర్ 1. హీరో నెంబర్ 1, దీవానా మస్తానా, దుల్హే రాజా, బడే మియా చోటా మియా, అనారి నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలు ఆయనకు సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి. గోవిందా సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుందన్న గుర్తింపు తెచ్చుకున్నారు.

పెళ్లయినా ఆ హీరోయిన్‌తో ఎఫైర్
బాలీవుడ్‌లో పోటీ పెరుగుతుండటం, కొత్త కుర్రాళ్ల ఎంట్రీతో గోవిందా హవా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా రియాలిటీ షోలకు జడ్జిగా టీవీపైనా సత్తా చాటారు గోవిందా. సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కొత్తలోనే సునీతను 1987లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే స్టార్‌గా ఎదుగుతున్న దశలో హీరోయిన్ నీలం కొఠారితో గోవిందా ప్రేమలో పడినట్లుగా అప్పట్లో మీడియా కోడై కూసింది. ఓ దశలో వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సునీత వద్ద కూడా ప్రస్తావించినట్లు ఓ ఇంటర్వ్యూలో గోవిందా తెలిపారు. అయితే ఆమె నచ్చచెప్పడంతో నీలంను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారట గోవిందా.

పనిమనిషిగా గోవిందా ఇంటికి
అలాంటిది ఏకంగా మంత్రిగారి అమ్మాయి.. ఏకంగా తమ ఇంట్లో 20 రోజులు ఉందని గోవిందా సతీమణి సునీత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తమకు పెళ్లయిన కొత్తలో ఓ అమ్మాయి పనిమనిషిగా మా ఇంట్లో చేరిందని తనకు గిన్నెలు తోమడం, ఇంటి పనులు ఏవీ రావని సునీత చెప్పారు. కానీ గోవిందాను చూసేందుకు నిద్రపోకుండా ఎదురుచూసేదని తెలిపారు. అయితే ఆమె రూపం, మాటతీరు, ప్రవర్తన అన్నీ ఓ గొప్పింటి అమ్మాయిలా కనిపించిందని.. చివరికి తాను అనుమానించినట్లుగానే ఆమె ఓ మినిస్టర్ కూతురని, గోవిందాకు అభిమాని అని సునీత పేర్కొన్నారు.

గోవిందాను చూడటమే ఆమెకు కావాలని, రాత్రింబవళ్లు ఆయనకు దగ్గరగా ఉండాలని అనుకుందని సునీత నవ్వుతూ చెప్పారు. కూతురి విషయం తెలుసుకున్న మంత్రిగారు తన అనుచరులతో కలిసి నాలుగు వాహనాల్లో వచ్చి ఆమెను తీసుకెళ్లాడని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం సునీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. గోవిందా కోసం వచ్చిన ఆ మంత్రి గారి కూతురు ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: govinda sunita ahuja
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X