Fighter: హృతిక్ రోషన్‌కు కోలుకోలేని షాక్.. అక్కడ ఫైటర్ మూవీపై నిషేదం
ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా తనదైన రీతిలో యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ చేస్తూ బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు హృతిక్ రోషన్. ఆ మధ్య వరుస హిట్‌లతో పరిశ్రమను షేక్ చేసిన ఈ హ్యాండ్సమ్ హంక్.. కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. అయినా ప్రయత్నాలను మాత్రం చేస్తూనే ఉన్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రమే 'ఫైటర్'. యాక్షన్ డైరెక్టర్‌గా పేరొందిన సిద్దార్థ్ ఆనంద్ దీన్ని తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కించారు. ఫలితంగా ఎంతో హైప్ నడుమ ఈ సినిమా జనవరి 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఫైటర్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే కొన్ని ప్రచారం చిత్రాలను, పాటలను వదిలారు. అలాగే, ఇంటర్వ్యూలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే నేటి (జనవరి 24) సాయంత్రం ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు.
'ఫైటర్' మూవీ రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు జరుగుతోన్న తరుణంలోనే ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. హృతిక్ రోషన్ నటించిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో (కువైట్, బహ్రయిన్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా) నిషేదించినట్లు తాజాగా బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే, యూఏఈలో మాత్రం ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల అవుతుందని వెల్లడించింది.
హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీలో పైన పేర్కొన్న గల్ఫ్ దేశాలకు విరుద్ధంగా కొన్ని సీన్స్, డైలాగ్స్ ఉన్నాయట. దీంతో అక్కడి సెన్సార్ బోర్డులు ఈ చిత్రాన్ని నిషేదించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కారణంగానే 'ఫైటర్' మూవీ గల్ఫ్ దేశాల్లో విడుదల కావడం లేదని అంటున్నారు. ఇది హృతిక్ చిత్రానికి కోలుకోలేని షాక్ అని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. 'ఫైటర్' మూవీని వయాకామ్ 18 స్టూడియోస్, మార్ల్ఫిక్స్ పిక్చర్స్ బ్యానర్లపై సిద్ధార్థ్ ఆనంద్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్, అంకు తదితరులు నిర్మించారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్‌గా, అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంచిత్, అంకిత్, విశాల్ శేఖర్ సంగీతాన్ని అందించారు.


Click it and Unblock the Notifications











