ముద్దు సీన్లు హద్దులు దాటాయి.. హాట్ టాపిక్‌గా మారిన రణవీర్, అలియా లిప్‌లాక్!

రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించినగల్లీ బాయ్ చిత్రం ఫ్రిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ రొమాంటిక్ చిత్రంలో రణవీర్, అలియా భట్ అద్భుతంగా నటించారని ప్రశంసలు దక్కుతున్నా అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా ఎదురవుతున్నాయి. ఈ చిత్రంలో ఉండే కొన్ని ముద్దు సన్నివేశాలపై సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది.

ఘాటుగా ముద్దు సీన్లు

ఘాటుగా ముద్దు సీన్లు

బాలీవుడ్ రొమాంటిక్ హీరోలలో రణవీర్ సింగ్ ఒకరు. గల్లీ బాయ్ చిత్రంలో కూడా రణవీర్ ఘాటైన ముద్దు సన్నివేశాల్లో నటించాడు. రణవీర్, అలియా భట్ మధ్య వచ్చే లిప్ కిస్ సన్నివేశాల గురించి చిత్రం విడుదలకు ముందే చర్చ జరిగింది. గురువారం రోజు విడుదలైన ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు చూసి సగటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాలు హద్దులు దాటేలా ఉన్నాయనే విమర్శ ఎక్కువవుతోంది.

కల్కి కొచ్లిన్ కూడా

కల్కి కొచ్లిన్ కూడా

కేవలం అలియా భట్ తోనే కాదు.. మరో సపోర్టింగ్ రోల్ చేసిన కల్కి కొచ్లిన్ తో కూడా రణవీర్ ముద్దు సన్నివేశంలో నటించించాడు. ఈ చిత్రం విడుదలకు ముందు సెన్సార్ సభ్యులు గల్లీ బాయ్ లోని లిప్ లాక్స్ ని కట్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ సినిమాలో మాత్రం ముద్దు సన్నివేశాలు ప్రత్యక్షమయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ సన్నివేశాలని ఎందుకు తొలగించలేదనే చర్చ జరుగుతోంది.

వివాదం లేని చిత్రం

వివాదం లేని చిత్రం

ఈ వివాదంపై సిబిఎఫ్సీ చైర్మన్ తుషార్ కర్మార్కర్ స్పందించారు. ఇలాంటి వార్తలు ఎలా వచ్చాయో తెలియదు. గల్లీ బాయ్ చిత్రంలో ఎలాంటి వివాదం లేదు. ముద్దు సన్నివేశాలపై సెన్సార్ సభ్యులు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించారు అంతే. ముద్దు సన్నివేశాల ప్రదర్శనని నిర్మాతలకే వదిలేశాం అని తుషార్ తెలిపారు.

మహిళా దర్శకురాలు

మహిళా దర్శకురాలు

గల్లీ బాయ్ చిత్రాన్ని ప్రముఖ మహిళా దర్శకురాలు జోయా అక్తర్ తెరకెక్కించారు. రణవీర్ సింగ్ సింబా తర్వాత మరో హిట్ అందుకున్నాడు. గల్లీ బాయ్ కోసం రణవీర్, అలియా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల ప్రదర్శించిన స్పెషల్ స్క్రీనింగ్ కు రణవీర్ తన సతీమణి దీపికతో రాగా, అలియా తన ప్రియుడు రణబీర్ కపూర్ తో వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X