twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Breaking: Gulshan Kumar హత్యకేసులో సంచలన తీర్పు.. 14 ఏళ్లలో ఏం జరిగిందంటే.. మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్ వెనుక

    |

    మ్యూజిక్ రంగంలో ప్రతిష్టాత్మకమైన సంస్థ టీ సిరీస్ అధినేత గుల్హన్ కుమార్ హత్య కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వనున్నది. దాదాపు 14 ఏళ్లుగా ఈ హత్య కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరకు ఈ కేసులో కోర్టు తుది తీర్పును ఇచ్చేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో దేశ సినీ వర్గాలు ఈ కేసు తీర్పుపై దృష్టి పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    1997 జుహులో హత్య

    1997 జుహులో హత్య

    దేశ సినీ ప్రపంచంలో రారాజుగా వెలుగేలా టీ సీరిస్ సంస్థను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారు గుల్హన్ కుమార్. కేవలం మ్యూజిక్ రంగంలోనే కాకుండా నిర్మాతగా కూడా ఆయన విశేషంగా రాణిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లోనే గుల్హన్ కుమార్ హత్య జరిగింది. ఆయనను కొందరు 1997 ఆగస్టు 19వ తేదీన ముంబై నడిబొడ్డున జుహూ ప్రాంతంలో కాల్చి చంపారు. ఈ హత్య కేసులో చాలా మందిని అరెస్ట్ చేసి విచారించారు.

    సంగీత దర్శకుడు నదీం అరెస్ట్

    సంగీత దర్శకుడు నదీం అరెస్ట్

    గుల్హన్ కుమార్ హత్య కేసులో ప్రముఖ సంగీత దర్శకుడు నదీంను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. గుల్హన్ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను విచారించారు. అయితే ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అప్పట్లో శ్రవణ్‌తో కలిసి నదీం ఎన్నో హిట్ ఆల్బమ్స్ అందించారు. ఈ కేసులో నదీం కూరుకపోవడంతో వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నదీం దుబాయ్‌కి వెళ్లి పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో బిజీ అయిపోయాడు. శ్రవణ్ తన కుమారుడి కెరీర్‌పై దృష్టిపెట్టి సంగీత ప్రపంచానికి దూరంగా ఉండిపోయాడు.

    ముగ్గరిని ప్రధాన నిందితులుగా

    ముగ్గరిని ప్రధాన నిందితులుగా

    గుల్హన్ కుమార్ హత్య కేసులో అనేక మందిని విచారించిన తర్వాత ముగ్గురిని ప్రధాన నిందితులుగా కోర్టు నిర్ధారించింది. వారిలో రావుఫ్ మర్చంట్, చంచ్యా పిన్నమ్, రాకేశ్ కావోకర్ ముగ్గురు తుది తీర్పును ఎదుర్కోబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పును గురువారం జూలై 1వ తేదీన ముంబై కోర్టు ఇచ్చేందుకు సిద్ధమైంది.

    ప్రముఖ నిర్మాతపై మహా సర్కార్ కేసు

    ప్రముఖ నిర్మాతపై మహా సర్కార్ కేసు

    నిర్మాత, మ్యూజిక్ సంస్థ అధినేత గుల్హన్ కుమార్ హత్య కేసులో నిర్మాత రమేష్ తౌరానిని నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. అయితే ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గుల్హన్ కుమార్ హత్యకు ప్రేరేపించింది రమేష్ తౌరానీ అనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. పలుమార్లు రమేష్‌ను ముంబై పోలీసులు విచారించారు.

    జైలు నుంచి తప్పించుకొన్న మర్చంట్

    జైలు నుంచి తప్పించుకొన్న మర్చంట్

    గుల్హన్ కుమార్ హత్య కేసులో నిందితుడు అబ్దుల్ రావుఫ్ మర్చంట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు. ఈ కేసులో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తూ తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ఫేక్ ట్రావెల్ డాక్యుమెంట్స్, అక్రమ ప్రవేశం అంశాలతో అరెస్ట్ అయ్ాయడు. ఆ తర్వాాత అతడిని భారత్‌కు రప్పించారు. ప్రస్తుతం ఆర్థర్ రోడ్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నారు.

    English summary
    Bombay High Court to pronounce verdict in Gulshan Kumar murder case today. Gulshan Kumar, founder of T-Series, was killed on August 12, 1997, in Juhu area of Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X