ముంబై పోలీసులపై దుమ్మెత్తిపోస్తున్న కంగన, గూండాల రాజ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం మిస్టరీగా మారిన నేపథ్యంలో, కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఓ వైపు, కేసుకు సంబంధించిన ఒక్కొక్కరి నుంచి ముంబై పోలీసులు వాంగ్మూలం సేకరిస్తుండగా, మరోవైపు బీహార్ పోలీసులు సైతం విచారణ ముమ్మరం చేశారు. అయితే, ముంబైలో అడుగుపెట్టిన బీహార్ పోలీసులకు అదిలోనే చుక్కెదురైన వైనం తెలిసిందే. ఇక కేసులో ప్రతి కదలికను పరిశీలిస్తున్న కంగనా టీమ్, దీనిపై ధ్వజమెత్తింది.

కేసు విచారణ నిమిత్తం బీహార్ నుంచి ఐదుగురు సభ్యుల బృందం ముంబైకి చేరుకోగా, బృందానికి నాయకత్వం వహిస్తున్న బీహార్ ఎస్పీ, ఐపీఎస్ ఆఫీసర్ అయిన వినయ్ తివారీని విమానాశ్రయంలోనే బీఎంసీ అధికారులు అడ్డుకున్నారు. అతడిని బలవంతంగా క్వారెటైన్ కు తరలించారు. అయితే అధికారులు తమ పని తాము చేశామని చెబుతున్నప్పటికీ, కంగన టీమ్ వెనక్కుతగ్గడంలేదు. ఇది గూండాల రాజ్యాన్ని తలపిస్తోంది అంటూ దుమ్మెత్తిపోస్తోంది.

Gunda Raj... Team Kangana Lashes out Mumbai Police

సుశాంత్ మరణంలో ఓ రాజకీయవేత్త కొడుకు హస్తముందని, అతడిని కాపాడేందుకే ముంబై పోలీసులు ఈ అత్యత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించింది కంగన టీమ్. మరోవైపు, సుశాంత్ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్యపైనా బీహార్ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 2019లో రియాతో ఐరోపా ట్రప్ కు వెళ్లి వచ్చిన సుశాంత్, ఆ వెంటనే ఆనారోగ్యం బారిన పడ్డాడని కొందరు సన్నిహితులు తెలిపారు. ఈ వాదనలన్నీ సుశాంత్ సింగ్ మరణం అసాధారణమైన పరిస్థితిలో జరిగాయన్న అంశాన్ని బలపరుస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X