‘ఆదిపురుష్’ నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్: ఆ పాత్రను పరిచయం చేస్తున్నారట
పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగిపోయిన యంగ్ రెబెల్ స్టార్ హీరోగా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం నాటి కథతో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తైంది. శరవేగంగా చిత్రీకరణ సాగుతోన్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. దీంతో ఈ సినిమా షూట్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' మూవీ నుంచి ఓ సర్‌ప్రైజ్ రాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
'ఆదిపురుష్' మూవీ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో గత శ్రీరామ నవమికి ప్రభాస్‌కు సంబంధించిన పోస్టర్ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ, అది సాధ్యపడలేదు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేయబోతున్నారట. అందరి కంటే ముందుగా హనుమంతుడి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై చిత్ర యూనిట్ డిజైన్స్‌ను కూడా ఫైనల్ చేసేసిందట. అతి త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుందనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ రాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇది తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











