హాట్ హీరోయిన్‌పై మనసు పడ్డ హర్బజన్ సింగ్.. షాకింగ్‌గా భార్య రియాక్షన్!
ఇటీవల కాలంలో దేశంలోని సినీ రంగాలన్నింటిలోనూ బయోపిక్‌లా హవా నడుస్తున్నది. అయితే తాజాగా సినీ హీరోగా మారిన క్రికెటర్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన జీవితంపై బయోపిక్‌పై స్పందించారు. తన లైఫ్ ఆధారంగా బయోపిక్ రూపొందితే ఆ పాత్రలకు ఎవరైతే సరిపోతారనే ప్రశ్నకు హర్భజన్ ఇచ్చిన సమాధానానికి ఆయన భార్య గీతా బస్రా షాకింగ్‌గా జవాబిచ్చారు. వారి మధ్య జరిగిన అర్గ్యూమెంట్ ఏమిటంటే...

నా బయోపిక్‌లో నేనే హీరో
క్రికెటర్ హర్భజన్ సింగ్ తన జీవితం ఆధారంగా బయోపిక్ రూపొందిస్తే అందులో తానే హీరోగా నటిస్తానని, తన పాత్రకు మరొకరు న్యాయం చేయలేరు. కాబట్టి నా నిజ జీవిత పాత్రకు తెర మీద తానే రూపం ఇస్తే బాగుంటుంది అని హర్భజన్ అభిప్రాయపడ్డారు.

రణ్‌వీర్ సింగ్, కియారా అయితే న్యాయం
ఒకవేళ తాను కాకుండా తన పాత్రకు రణ్‌వీర్ సింగ్ అయితే న్యాయం చేయగలడు అని హర్బజన్ సింగ్ తెలిపారు. ఇక తన భార్య గీతా బస్రా పాత్రకు కియారా అద్వానీ అయితే కర్టెక్ట్‌గా సూట్ అవుతుంది. రణ్‌వీర్ సింగ్, కియారా అద్వానీ జంట బాగుంటుంది అని భజ్జీ తన మనసులో మాట చెప్పారు.

భజ్జీ భార్య అసంతృప్తి
అయితే తన పాత్రకు కియారా అద్వానీ అయితే బాగుంటుందనే విషయంపై హర్భజన్ భార్య గీతా బర్సా వ్యతిరేకించారు. హర్భజన్ పాత్రలో వికీ కౌశల్, తన పాత్రకు ప్రియాంక చోప్రా జోనస్ అయితే కరెక్ట్‌గా సరిపోతారు. వారిద్దరు మాత్రమే మా పాత్రలకు న్యాయం చేస్తారు అని గీతా బస్రా అన్నారు.

హర్భజన్ ఫ్యామిలీ లైఫ్ గురించి
ఇక హర్బజన్ సింగ్, గీత బస్రా లైఫ్ విషయానికి వస్తే.. వారిద్దరూ చాలా కాలం ప్రేమించుకొన్న తర్వాత 2015, అక్టోబర్ 29వ తేదీన వివాహం చేసుకొన్నారు. వారిద్దరికి హినయా హీర్ ప్లాహా అనే కూతురు ఉంది. ప్రస్తుతం క్రికెట్‌ను వదిలి సినీ రంగంలోకి ప్రవేశించారు.

ఫ్రెండ్‌షిప్ ద్వారా హర్బజన్ సినీ ఎంట్రీ
క్రికెట్ మైదానాన్ని వీడిన హర్భజన్ సింగ్ తమిళ సినీ రంగం ద్వారా నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్‌తో కలిసి ఫ్రెండ్‌షిప్ అనే చిత్రంలో హర్భజన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











