twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రచ్చ రేపడానికి ప్లాన్ చేసిన హరీష్ శంకర్.. ఒకే పిక్ తో ఫ్యాన్స్కి ఫీస్ట్!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఏపీలో రాజకీయాలు చూసుకుంటూనే మరో పక్క సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే ఆయన మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు.. అందులో రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరో రెండు సినిమాలు స్క్రిప్ట్ పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉన్నాయి. ఆ షూటింగ్ కి రెడీగా ఉన్న సినిమాలలో హరీష్ శంకర్ కాంబినేషన్ సినిమా ఒకటి. తాజాగా హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కు ఒక మంచి ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    నాలుగు సినిమాలతో బిజీ

    నాలుగు సినిమాలతో బిజీ

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించాడు.

    హిందీ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి స్పందన తెచ్చుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ లకు సంబంధించి కొంత వివాదం నడవడంతో ఈ సినిమా కలెక్షన్లు ఎంత అనే విషయం ఇప్పటికీ సరైన క్లారిటీ లేదు. ఆ విషయం పక్కన పెడితే ఆయన మరో నాలుగు సినిమాలు ఒప్పుకున్నాడు.

    ఫ్యాన్స్ కోసం ఫీస్ట్

    ఫ్యాన్స్ కోసం ఫీస్ట్

    నాలుగు సినిమాలలో జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్ల సినిమా షూటింగ్ దశలో ఉంది, అలాగే నాగ వంశీ నిర్మాణంలో అయ్యప్పనుమ్ కోశియం రీమేక్ కూడా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమాకి సాగర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో మరో సినిమా కూడా పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. అయితే తాజాగా హరీష్ శంకర్ సంబంధించిన సినిమా అప్డేట్ ఒకటి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    అన్నీ వెనక్కి నెట్టిన కరోనా

    అన్నీ వెనక్కి నెట్టిన కరోనా

    అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే హరీష్ శంకర్ సినిమా షూటింగ్ జూలై లో మొదలు కావాల్సి ఉంది. కానీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

    దీంతో పవన్ కళ్యాణ్ కు టెస్ట్ షూట్ చేసిన కొన్ని ఫోటోలలో ఒక దానిని హరీష్ శంకర్ త్వరలో ప్రీ లుక్ లాగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ సినిమాకు సంచారి అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమాలో పవన్ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది ఈ విషయం మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

    అంచనాలు పెంచేస్తూ

    అంచనాలు పెంచేస్తూ

    నిజానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పెరిగిపోతున్నాయి.. అంచనాలకు తగ్గట్టు గానే హరీష్ శంకర్ పూర్తి కమర్షియల్ అంశాలతో కూడిన స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

    ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలాగే ఒక ట్రావెలర్ పాత్రలో నటిస్తున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఇక సినిమా లేట్ అవుతున్న కారణంగా ఈ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Harish Shankar who is going to direct Pawan Kalyan soon, would be revealing the recent photo session with Pawan. Rumoured to be billed as Samchari, Pawan is said to be seen in two dimensional character.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X