అంతలోనే ఎంత మార్పు.. భజరంగీ భాయీజాన్ పాప పిక్స్ వైరల్

బయట మనం సహజంగా ఓ మాట వింటుంటాం. ఆడపిల్లలు కదా త్వరగానే ఎదుగుతారు అని పెద్దవాళ్లు అంటుంటారు. అది నిజమే. ఎందుకంటే భజరంగీ భాయీజాన్ సినిమాలో మున్నీగా అందరి మనసులను దోచిన ఆ పాపను ఇప్పుడు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మున్నీగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి.. ఆ సినిమా సక్సెస్‌లో కీలకపాత్ర పోషించింది. భజరంగీ భాయీజాన్ ప్రతీ ఒక్కరి మనసులను కదిలించింది.

ఆ కథ స్ఫూర్తితోనే...

ఆ కథ స్ఫూర్తితోనే...

భజరంగీ భాయీజాన్ (2015) సినిమాకు కథను అందించింది విజయేంద్ర ప్రసాద్. పసివాడి ప్రాణం సినిమాకు ఇదే స్టోరీ లైన్‌లో ఉంటుందని, ఓ పాపను కాపాడే కాన్సెప్ట్‌ను ప్యాన్ ఇండియా లెవెల్ డెవలెప్ చేయడంతో అది భజరంగీ భాయీజాన్ అయిందని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ నుంచి ఓ మూగ పాప దారి తప్పి ఇండియాలోకి రావడం.. ఆమెను కాపాడి మళ్లీ పాకిస్తాన్‌లో వదిలిపెట్టే కథలో సల్మాన్ ఖాన్ అదరగొట్టేశాడు.

స్పెషల్ క్యారెక్టర్..

స్పెషల్ క్యారెక్టర్..

భజరంగీ భాయీజాన్ చిత్రానికి సల్మాన్ ఖాన్ ఎంత ప్లస్ అయ్యాడో.. పాప పాత్ర కూడా అంతే ప్లస్ అయింది. కళ్లతోనే హావభావాలను పలకరించి..చిన్ని నవ్వుతోనే అందర్నీ కట్టిపడేసింది. అలాంటి మున్నీని ఇప్పుడు చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

అలా వైరల్..

అలా వైరల్..

భజరంగీ భాయీజాన్ పాప పేరు హర్షాలీ మల్హోత్రా. 2008 లో జన్మించిన హర్షాలీ మల్హోత్రా కుబూల్ హై,లౌట్ ఆవో త్రిష సీరియల్స్ లో నటించింది. అలాగే సావధాన్ ఇండియా లో కూడా నటించింది. అంతే కాకుండా ఫేర్ అండ్ లవ్లీ, పియర్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హార్లిక్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించింది.

అంత మార్పా?

అంత మార్పా?

దీపావళి సందర్భంగా పండుగను జరుపుకున్న ఫోటోలను ఇటీవల హర్షాలీ మల్హోత్రా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఐదేళ్లలోనే హర్షాలీలో ఎంతో మార్పు వచ్చింది. చిన్న పాప ఇంతలా ఎదిగిందా? ఐదేళ్లలోనే ఇంత మార్పా? నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X