twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ పెటాకులైంది... తెలుగు హీరోను వదిలేసిన బాలీవుడ్ బ్యూటీ?

    |

    తెలుగు హీరో హర్షవర్ధన్ రాణె కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ కిమ్ శర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సహజీవనం చేస్తున్న ఈ హాట్ పెయిర్ ముంబైలో జరిగే పార్టీలు, పంక్షన్లలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్ చల్ చేస్తూ మీడియాకెక్కారు. అయితే వీరి బంధం ఎంతోకాలం నిలవలేదు.

    బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఈ ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే వీరి మధ్య గొడవ జరిగిందని, అప్పటి నుంచి మాట్లాడు కోవడం లేదని, మళ్లీ కలిసే అవకాశాలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి.

    అందుబాటులో లేరు

    అందుబాటులో లేరు

    హర్షవర్ధన్ రాణె, కిమ్ శర్మ బ్రేకప్ గురించిన వార్తలపై స్పందించేందకు ఇద్దరూ అందుబాటులోకి రావడం లేదు. నెలరోజుల క్రితం గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇద్దరూ అప్‌సెట్లో ఉన్నారని, మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్ట పడటం లేదని టాక్.

    విషయం ఖరారు చేసిన పబ్లిసిస్ట్

    విషయం ఖరారు చేసిన పబ్లిసిస్ట్

    తమ బ్రేకప్ విషయాన్ని వారు అఫీషియల్‌గా ఖరారు చేయకపోయినప్పటికీ... హర్షవర్ధన్ పబ్లిసిస్ట్ ఓ బాలీవుడ్ పోర్టల్‌తో మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. వాకీ బంధం తెగిపోయినమాట నిజమే అని, ఇక వారు కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

    కొన్ని రోజుల క్రితం ఆమెతో తన రిలేషన్ గురించి

    కొన్ని రోజుల క్రితం ఆమెతో తన రిలేషన్ గురించి

    గత డిసెంబర్లో హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో తమ ఎఫైర్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఏ విషయంలో అయినా ఓపెన్‌గా ఉంటాను. ఇందులో దాయడానికి ఏమీ లేదు. అలాంటి వ్యక్తిని కాదు. రిలేషన్‌షిప్‌లో ఉన్న మాట నిజమే. అది నా వ్యక్తిగతం. నేను ప్రైవేట్ పర్సన్. ఇతరుల విషయాలను కూడా అలాగే చూస్తాను' అని తెలిపారు.

    సెక్స్ మార్పిడి సర్జరీ కాన్సెప్ట్: షాకివ్వబోతున్న తెలుగు హీరోయిన్!సెక్స్ మార్పిడి సర్జరీ కాన్సెప్ట్: షాకివ్వబోతున్న తెలుగు హీరోయిన్!

    కిమ్ శర్మ ప్రేమ వ్యవహారాలు

    కిమ్ శర్మ ప్రేమ వ్యవహారాలు

    హర్షవర్దన్‌తో రిలేషన్లో దిగడానికి ముందే... కిమ్ శర్మ ప్రేమ వ్యవహారాలతో వార్తల్లోకి ఎక్కారు. గతంలో ఆమె కెన్యాకు చెందిన అలీ పుంజని అనే వ్యాపారిని పెళ్లాడిన 20017లో విడిపోయారు. ఆ తర్వాత బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అర్జున్ ఖాన్నాతో ప్రేమలో పడ్డారు. అనంతరం కిమ్ జీవితంలోకి హర్షవర్ధన్ ప్రవేశించారు.

    ఖడ్గం మూవీలో మెరిసిన కిమ్ శర్మ

    ఖడ్గం మూవీలో మెరిసిన కిమ్ శర్మ

    ''ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద'' అంటూ ఖడ్గం సినిమాలో సెక్సీ యాటిట్యూడ్‌తో టాలీవుడ్ కుర్రకారును ఊర్రూతలూగించిన కిమ్ శర్మ... ‘మగధీర' చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టారు.

    English summary
    According to reports, Harshvardhan Rane and Kim Sharma have broken-up recently. The two actors were unavailable to comment but Harshvardhan's publist in a statement to an entertainment portal confirmed that the two actors are not together anymore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X