ఐటమ్ బ్యూటీతో యువ నటుడి రొమాన్స్.. దాచిపెట్టడం నాకు ఇష్టం ఉండదు!
సినీ సెలెబ్రిటీల పెళ్లి, ప్రేమ విషయంలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. కుర్ర నటులంతా తమకన్నా వయసు ఎక్కువ ఉండే భామల ప్రేమలో పడుతున్నారు. ప్రియాంక చోప్రా, సుష్మిత సేన్, మలైకా అరోరా విషయంలో ఇదే జరిగింది. తాజాగా మరో యువ నటుడు కూడా ముదురు బ్యూటీ ప్రేమలో పడ్డాడు. తమ రిలేషన్ షిప్ నిజమే అంటూ మీడియాకు వివరించేశాడు. ఇందులో దాచిపెట్టడానికి ఏమి లేదు. అలా చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు అని చెప్పేశాడు. కిమ్ శర్మ, హర్షవర్ధన్ రానే చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

దాచి పెట్టేది ఏముంది
కిమ్ శర్మ, హరుషవర్దన్ రానే మధ్య ఘాటు ఎఫైర్ సాగుతోందంటూ చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. హర్షవర్ధన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ప్రేమ గురించి ఓపెన్ అయిపోయాడు. దాచిపెట్టేది ఏముంది.. అవును, నేను కిమ్ శర్మ రిలేషన్ లో ఉన్నాము. ఇలాంటి విషయాలు దాచిపెట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఆమె వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా.. అందుకే ఇంతకు మించిన వివరాలు వెల్లడించలేను అని తెలిపాడు.

నా జీవితం తెరచిన పుస్తకం
టీనేజ్ లోనే ఇంటినుంచి పారిపోయి వచ్చా. చాల కష్టాలు అనుభవించా. సైబర్ కేఫ్ లో, ఎస్టీడీ బూత్ లో కూడా పనిచేశా. ప్రస్తుతం నటుడిగా స్థిరపడ్డా అని హర్షవర్ధన్ తెలిపాడు. నా జీవితంలో ఇంతకు మించిన సీక్రెట్స్ లేవు అని హర్షవర్ధన్ తెలిపాడు. నా జీవితం తెరచిన పుస్తకం అని తెలిపాడు. చాలా రోజులుగా ఈ విషయం గురించి కిమ్ శర్మ కూడా తప్పించుకుంటూ వస్తోంది. ఇటీవల తన సోషల్ మీడియాలో హర్షవర్ధన్ తో ఉన్న ఫోటో పోస్ట్ చేసి ప్రేమ విషయాన్ని ఖరారు చేసింది.

తెలుగులోనే ఎక్కువగా
హర్షవర్ధన్ తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. రవిబాబు దర్శత్వం వహించిన అవును సిరీస్, ప్రేమ ఇష్క్ కాదల్, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, బెంగాల్ టైగర్, ఫిదా లాంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించాడు. ఆల్రెడీ వివాహం జరిగి విడాకులతో భర్త నుంచి విడిపోయిన కిమ్ శర్మతో ఇతడు కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. చాలారోజులాగా మౌనం వహిస్తూ వస్తున్న హర్షవర్ధన్ తాజాగా తన రిలేషన్ ని బయట పెట్టాడు.

హాట్ బ్యూటీగా
కిమ్ శర్మ పలు చిత్రాల్లో స్పెషల్ రోల్స్ చేసింది. తెలుగులో కృష్ణవంశీ దర్శత్వం వహించి ఖడ్గం చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత మగధీర చిత్రంలో ఐటెం సాంగ్ లో అందాలు ఆరబోసిన సంగతి తెలిసిందే. కిమ్ శర్మ ఓ ప్రముఖ క్రికెటర్ తో లవ్ ఎఫైర్ సాగించినట్లు కూడా రూమర్స్ ఉన్నాయి. 2010లో అలీ పుంజలి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న కిమ్ శర్మ 2016 లో అతడి నుంచి విడిపోయింది.


Click it and Unblock the Notifications











