అర్థరాత్రి స్టార్ హీరో ఇంట్లోకి దూరిన అభిమాని.. గూగుల్‌లో వెతికి మరీ!

సినీ హీరోలపై కొందరు ఫాన్స్ మితిమీరిన అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. హద్దులు దాటే అభిమానం వలన పలు సందర్భాల్లో అటు అభిమానులకు, ఇటు హీరోలకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైన సంఘటనలు చూస్తూనే ఉన్నాము. తాజగా అలంటి ఘటనే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎదురైంది. హరియాణ కు చెందిన అంకిత్ అనే వ్యక్తి తన వింత ప్రవర్తనతో అరెస్ట్ అయ్యాడు. అతడు అక్షయ్ కుమార్ ని కలిసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ కావలసిందే.

 గూగుల్‌లో వెతికి

గూగుల్‌లో వెతికి

హరియాణలోని సోనిపట్ ప్రాంతానికి చెందిన అంకిత్ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు వీరాభిమాని. ఎలాగైనా అక్షయ్ ని కలవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా హరియాణ నుంచి ముంబై వచ్చేశాడు. ఇక అక్షయ్ కుమార్ అడ్రెస్ కోసం ఎంత ప్రయత్నించిన తెలియలేదు. దీనితో అడ్రెస్ కోసం గూగుల్ లో వెతికాడు. అడ్రెస్ దొరకడంతో వెంటనే అక్షయ్ నివాసం వద్దకు వెళ్ళిపోయాడు.

అర్థరాత్రి గోడదూకి

అర్థరాత్రి గోడదూకి

అక్షయ్ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకుని అతడిని వెనక్కు పంపేశారు. దీనితో రాత్రి 1 గంట సమయంలో అక్షయ్ కుమార్ ఇంటి గోడ దూకి, సెక్యూరిటీ కళ్లుగప్పి బాల్కనీలోకి ప్రవేశించాడు. అక్షయ్ కుమార్ కోసం నానా రభస సృష్టించడంతో అతడిని సెక్యూరిటీ వెంటనే అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

 బాలీవుడ్ లోకి వెళ్లాలని

బాలీవుడ్ లోకి వెళ్లాలని

పోలిసుల విచారణలో తాను అక్షయ్ కుమార్ కు పెద్ద అభిమానిని అని ఎప్పటి నుంచో అతడిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తానట్లు అంకిత్ తెలిపాడు. తనకు బాలీవుడ్ లో రాణించాలనే కోరిక ఉందని, దానికోసం అక్షయ్ కుమార్ సాయం తీసుకుందాం అని ఆయన్ని కలవడానికి ఇలా చేసినట్లు తెలిపాడు. మితిమీరిన అభిమానంతోనే ఇలా చేశాడని, ఇందులో అనుమానించాల్సిన, భయానికి గురికావాల్సిన అంశాలు లేవని పోలీసులు తేల్చారు.

గతంలో ఇలాగే

గతంలో ఇలాగే

హీరోల ఇంటిముందు వీరాభిమానులు వింత చర్యలకు పాల్పడడం ఇది కొత్త కాదు. గతంలో బిగ్ బి అమితాబ్ కు కూడా ఇలాంటి ఘటన ఎదురైంది. ఓ అభిమాని అమితాబ్ కాంపౌండ్ దూకి లోనికి ప్రవేశించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అమితాబ్ అతడిని వదిలేయాల్సిందిగా పోలీసులని కోరడంతో విడుదల చేశారు. 2016లో ఈ ఘటన జరిగింది. తమ అభిమాన హీరోలని కలుసుకోవాలని ఇంటినుంచి పారిపోవడం, తెలిసి తెలియని పనులు చేయడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X