twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థాకరే ట్రైలర్‌లో సౌత్ ఇండియన్స్‌పై బూతులు.. లుంగీలు అంటూ, విరుచుకుపడ్డ హీరో!

    |

    నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన మరాఠీ చిత్రం థాకరే. శివసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బాల థాకరే జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం ఇది. ఈ చిత్రంలో థాకరే పాత్రలో నవాజుద్దీన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంపై ఇప్పటికే సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. నిన్ననే ట్రైలర్ కూడా విడుదలై వివాదం సృష్టిస్తోంది. హిందూ మత నేపథ్యంలో థాకరే శివ సేన పార్టీని స్థాపించారు. ట్రైలర్ లో సౌత్ ఇండియన్స్ పై పరోక్షంగా ఉన్న కొన్ని డైలాగులు దుమారం రేపుతున్నాయి. ఈ డైలాగులపై సౌత్ హీరో సిద్ధార్థ్ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతున్నాడు.

    లుంగీలు పైకెత్తి..

    లుంగీలు పైకెత్తి..

    ఈ ట్రైలర్ లో సౌత్ ఇండియన్స్ ని ఉద్దేశించి ఉన్న ఓ డైలాగ్ దుమారం రేపుతోంది. లుంగీ పైకెత్తి..... అంటూ పేర్కొనలేని పదజాలంతో ఉన్న డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయి. సౌత్ ఇండియా ప్రజలు ఎక్కువగా లుంగీలు, పంచెలు ధరిస్తారు. బాల థాకరే లాంటి వ్యక్తి బయోపిక్ చిత్రీకరిస్తూ ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని నెటిజన్లు సైతం మండి అపడుతున్నారు. ఇది సౌత్ ఇండియన్ ప్రజల మనో భావాలని కించపరచడమే అని అంటున్నారు.

    క్లియర్‌గా అర్థం అవుతోంది

    హీరో సిద్ధార్థ్ థాకరే ట్రైలర్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. నవాజుద్దీన్ లాంటి నటుడు ఇలాంటి డైలాగులు చెప్పడం ఏంటి అని లుంగీ డైలాగ్ గురించి ప్రస్తావించాడు. ఒక పథకం ప్రకారం సబ్ టైటిల్స్ లేకుండా వివాదాస్పద డైలాగ్స్ పెట్టారు. మీరు ఇలాంటి వివాదాలు సృష్టించి సొమ్ము చేసుకోవాలని భవిస్తున్నారా అంటూ సిద్ధార్థ్ సూటిగా ప్రశ్నించాడు. ఇలాంటి నీఛమైన పనులు ఇక ఆపండి అంటూ సిద్ధార్థ్ మండిపడ్డాడు.

    ప్లానింగ్‌లో భాగమా

    ప్లానింగ్‌లో భాగమా

    థాకరే జీవిత చరిత్ర వివాద భరితం అని తెలుసు. బాబ్రీ మసీదు సంఘటన, మహారాష్ట్ర వ్యాప్తంగా పలు అల్లర్లు.. ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన నాయకత్వం ఇలా థాకరే జీవితంలో అనేక వివాదభరిత అంశాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి పాత్రలో ముస్లిం నటుడైన నవాజుద్దీన్ సిద్దిఖిని నటింపజేయడం ప్లానింగ్ లో భాగం అని స్పష్టంగా అర్థం అవుతోంది అంటూ సిద్ధార్థ్ అభిప్రాయ పడ్డాడు.

    రాజకీయ జీవితం మొత్తం

    రాజకీయ జీవితం మొత్తం


    థాకరే రాజకీయ జీవితం మొత్తం మత, ప్రాంతీయ విద్వేషాల కేంద్రంగానే సాగింది. ఇలాంటి వ్యక్తి జీవితం ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమాపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు తెలియజేస్తున్నా నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ఈ చిత్రానికి కథని అందించారు. ఆయన కోప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

    English summary
    ‘Hate speech’ against south Indians in Thackeray biopic trailer, actor Siddharth objects Despite an uproar online and CBFC’s objection to some of the dialogues, the writer and co-producer of the film, Shiv Sena MP Sanjay Raut, has refused to make any changes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X