గర్భవతి అయిన యువరాజ్ సింగ్ భార్య.. ఇషా అంబానీ పెళ్ళిలో!

Recommended Video

Yuvraj Singh Wife Hazel Keech Reveals The Truth About Her Pregnancy

క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హేజల్ కీచ్ 2016లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. అంతకు ముందుకు యువి సాగించిన ప్రేమ వ్యవహారాలన్నీ పెళ్లి వరకు రాలేదు. చివరకు హేజల్ ప్రేమకు దాసుడైపోయిన యూవీ ఆమెని 2016 నవంబర్ 30న కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. క్రికెటర్ గా యూవీ కెరీర్ చివరి దశకు చేరుకుంది. యూవీ ప్రస్తుతం పొట్టి ఫార్మాట్ కు మాత్రమే పరిమితం అయ్యాడు. రెండు రోజుల క్రితమే యూవీ 37వ జన్మదినం జరుపుకున్నాడు. ఈ దశలో యూవీ ఫ్యామిలిలో సంతోషాలు విరిసే వార్త బయటకు వచ్చింది.

ఇషా అంబానీ పెళ్లి వేడుకలో

ఇషా అంబానీ పెళ్లి వేడుకలో

ఇటీవల అపర కుబేరుడు ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులంతా హాజరయ్యారు. యువరాజ్ సింగ్ దంపతులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో హేజల్ కీచ్ పలు సందర్భాల్లో డ్రెస్ ని కవర్ చేసుకుంటూ కనిపించింది. హేజల్ కీచ్ గర్భవతి అని వార్తలు మొదలయ్యాయి.

తండ్రి కాబోతున్న యూవీ

తండ్రి కాబోతున్న యూవీ

ఈ వార్త ఇపుడు నిజం అయింది. మీడియాలో యువరాజ్, హేజల్ కీచ్ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ అధికారికంగా వార్తలు వస్తున్నాయి. యూవీ సన్నిహితులు ఈ వార్తని ధృవీకరించినట్లు తెలుస్తోంది. హేజల్ కీచ్ గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులంతా సంబరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా కలం తరువాత ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

ఎమోషనల్ పోస్ట్

ఎమోషనల్ పోస్ట్

యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా హేజల్ ఇంస్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అనునిత్యం నన్ను ఆకట్టుకునే వ్యక్తి, ఎలాంటి సమయంలో అయినా చిరునవ్వు కోల్పోని వ్యక్తి నా భర్త అని హేజల్ పేర్కొంది. ప్రతి రోజు నా శుభాకాంక్షలు నీకు ఉంటాయి. ఈ రోజు నీ పుట్టినరోజు కావున ప్రత్యకమైన శుభాకంక్షలు. ఎలాంటి స్వార్థం లేకుండా నిత్యం నీ పక్కనే ఉంటా.. నీ ప్రియమైన భార్య హేజల్ కీచ్ అంటూ యువరాజ్ కు బర్త్ డే విషెష్ చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X