‘‘సహజీవనం చేసి రేప్ అంటే ఎలా? ఆమె నా కూతురెలా అవుతుంది?’’ కంగనాపై నటుడి భార్య
బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోళి తనపై లైంగిక దాడి చేశాడని, రేప్ చేశాడని ఆరోపిస్తూ కంగనా రనౌత్ కంప్లయింట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో పంచోళిని ఆయన భార్య జరీనా వాహెబ్ వెనకేసుకు రావడం చర్చనీయాంశం అయింది.
తాజాగా వాహెబ్ ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ... 'తన భర్త ఎలాంటి తప్పు చేయలేదు' అని వ్యాఖ్యానించారు. నా భర్త గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు, నాతో అన్ని విషయాలు పంచుకునేవారు. గతంలో నా భర్తతో కలిసి కంగనా రనౌత్ సహజీవనం చేసిందని తెలిపారు.

అప్పుడు సహజీవనం చేసి ఇపుడు రేప్ అంటే ఎలా?
అప్పుడు నా భర్తతో సహజీనవం చేసిన కంగనా రనౌత్.. ఇపుడు రేప్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఒక వ్యక్తితో కొంతకాలం కలిసి సహజీవనం చేసి విడిపోయిన తర్వాత అతడిపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదు అంటూ జరీనా వాహెబ్ వాపోయారు.

అలాంటి వ్యక్తి నాకు కూతురెలా అవుతుంది?
2017లో ‘సిమ్రన్' మూవీ ప్రమోషన్స్ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ... ‘ఆదిత్య పంచోళి దారుణ ప్రవర్తనపై సహాయం కోరుతూ జరీనా వాహెబ్ ఆశ్రయించాను, ఒక కూతురిగా భావించి హెల్ప్ చేయాలని కోరాను. ఆమె మనసు కరుగలేదు' అ తెలిపారు. కంగనా వ్యాఖ్యలపై తాజాగా జరీనా వాహెబ్ స్పందిస్తూ... ‘ఆమె నా భర్తతో నాలుగున్నర సంవత్సరాలు సహజీవనం చేసింది. అలాంటి వ్యక్తిని నా కూతురుగా ఎలా భావించాలి? అది అసాధ్యం' అని వ్యాఖ్యానించారు.

పరువు నష్టం దావా వేసిన పంచోళి
కంగనా రనౌత్ ఇటీవల ముంబైలోని వెర్సోవా పోలీసులకు చేసిన ఫిర్యాదులో 13 సంవత్సరాల క్రితం తనకు, పంచోళికి మధ్య జరిగిన సంఘటన గురించి వివరించారు. ఆదిత్య తనపై లైంగిక దాడి చేశాడని, లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పంచోళి వెంటనే రియాక్ట్ అవుతూ... కంగనా మీద పరువు నష్టం దావే వేసిన సంగతి తెలిసిందే. కంగనా చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలే అని, ఇదంతా తనపై జరుగుతున్న కుట్రగా ఆరోపించారు.

కంగనా రనౌత్ మూవీస్
కంగనా రనౌత్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన నటించిన ‘మెంటల్ హై క్యా' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఇందులో కంగనాతో పాటు రాజ్ కుమార్ రావు మెయిన్ లీడ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











