Prabhas: ఆ విషయంలో ఆదిపురుష్ ను మించిపోతున్న ప్రాజెక్ట్ K.. అంతకుమించి అనేలా..
రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. బాహుబలి 2 సినిమా తర్వాత అసలైతే ప్రభాస్ కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలలో చేయాలని అనుకున్నాడు. అది కూడా వందకోట్ల లోపే ఉండేలా ప్లాన్ కూడా చేసుకున్నాడు. కానీ పాన్ ఇండియా ఇమేజ్ కారణంగా ప్రభాస్ కు ఎక్కువగా అధిక బడ్జెట్ ఆఫర్లే వస్తున్నాయి. దీంతో వచ్చిన ఆఫర్ మిస్ చేసుకోకూడదు అని ప్రభాస్ ప్రస్తుతం ప్రపంచ స్థాయిలో నిలబడే సినిమాలను చేస్తున్నాడు. ముందుగా రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
లవ్ అడ్వెంచర్ ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమాను జిల్ దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సినిమా లో ఒక కొత్త ప్రేమ ప్రపంచాన్ని చూపించనున్నట్లు వివరణ ఇచ్చాడు. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కూడా తెలియజేశాడు. అయితే ఈ సినిమా అనంతరం ప్రభాస్ సలార్ ను కూడా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా ఆలస్యం అయ్యేలా ఉంది. ఇక ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు దాదాపుగా కోట్లు 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్టుకి లో కూడా గ్రాఫిక్స్ ఎపిసోడ్స్ చాలానే ఉండబోతున్నాయి. ఆ సినిమా టైం ట్రావెలింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం. దర్శకుడు మూడు కాలాలకు సంబంధించిన అంశాలను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ సినిమా కోసం కూడా భారీ స్థాయిలో గ్రాఫిక్స్ అవసరం ఉంది కాబట్టి విఎఫ్ఎక్స్ వర్క్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని తీసుకు వస్తున్నారు. ఆ సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. సీనియర్ నిర్మాత సి.అశ్వనీదత్ వైజయంతి ప్రొడక్షన్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ సినిమాను వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. ఇక గ్రాఫిక్స్ కోసం చాలా ఖర్చు అవుతున్నట్లు సమాచారం. ఇంటర్వెల్ సన్నివేశాల కోసం 60 నుంచి 70 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. క్లైమాక్స్ లో వచ్చే విఎఫ్ఎక్స్ సన్నివేశాలకి కూడా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే నిర్మాత లో 170 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఈ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొన్ నటిస్తుండగా ఒక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. అంతేకాకుండా కొంత మంది ప్రముఖ నటీనటులు కూడా ఈ సినిమాలో స్పెషల్ పాత్రలో ఆ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే ప్రభాస్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.


Click it and Unblock the Notifications











