అమ్మమ్మగా మారిన హేమమాలిని.. కవల పిల్లలకు జన్మినిచ్చిన కూతురు
బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమా మాలిని మరోమారు అమ్మమ్మ అయ్యారు. అలనాటి సూపర్‌స్టార్ ధర్మేంద్ర, హేమా మాలిని కుమార్తె అహానా డియోల్ కవల పిల్లలకు జన్మినిచ్చారు. తన కవలలు జన్మించారని అహానా ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఆహానా డియోల్ తెలిపిన ప్రకారం.. తాను, తన భర్త వైభవ్ వోరా తల్లిదండ్రులు కావడం గర్వంగా ఉంది. మాకు కవల ఆడపిల్లలు జన్మించారు. ఈ చిన్నారులకు ఆస్ట్రాయియా, ఆడియా ఓరా అని నామకరణం చేశారు.

ఆహాన డియోల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వెల్లడిస్తూ.. నవంబర్ 26వ తేదీన మాకు కవల పిల్లలు జన్మించారు. మా ఇంటిలో పండగ వాతావరణం నెలకొన్నది. నా తల్లిదండ్రులు హేమా మాలిని, ధర్మేంద్ర డియోల్, వైభవ్ పేరెంట్స్ పుష్ప, విపిన్ ఓరా ఆనందంలో మునిగిపోయారు అంటూ పేర్కొన్నారు.
యువ పారిశ్రామికవేత్త వైభవ్ ఓరాతో ఆహానాకు 2013లో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రబరి 2014, 2వ తేదీన వివాహాం జరిగింది. 2015లో డెరియన్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు.


Click it and Unblock the Notifications











