For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదితి, కరీనా, అమీర్ ఖాన్ భార్య బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకే.. సినీరంగంలో రాజవంశానికి చెందిన వారెందరో తెలుసా?

  |

  భారతదేశంలో చాలా ఏళ్ళ క్రితం వరకు రాజుల పాలనలో ఉండేది. అయితే బ్రిటిష్ వారి ఎంట్రీతో చాలా వరకు రాజ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత స్వతంత్ర పోరాటం, ఎంతో మంది అసువులు బాసిన మీదట ఎట్టకేలకు రిపబ్లిక్ ఇండియాగా అవతరించింది. ఈ నేపధ్యంలో అక్కడక్కడా ఉన్న రాజ్యాలు కూడా ఇండియాలో కలిసిపోయాయి. అయితే రాజ్యాలు పోయినా రాజ కుటుంబాలు మాత్రం ఇంకా రాయల్ లైఫ్ లీడ్ చేస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే ఆ రాజ కుటుంబాలకి చెందిన వారు చాలా మంది బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. వారి వివరాల్లోకి వెళ్తే

  ఆయనొక్కడే కాదు

  ఆయనొక్కడే కాదు

  హిందీ చిత్ర పరిశ్రమలో కొంత మంది నటీ నటులు రాజుల కుటుంబాలకు చెందిన వారు. వారిని చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తారు. కానీ ఈ ఆకర్షణ రాజ కుటుంబాల నుండి వచ్చిన కొద్దిమందిలో అంతర్లీనంగా ఉంది. రాజకుటుంబం అని అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పటౌడీ నవాబ్, సైఫ్ అలీ ఖాన్ పేరు. కానీ ఆయన ఒక్కడే కాదు ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది రాజ కుటుంబీకులు ఉన్నారు. ఆ జాబితాను పరిశీలిస్తే

  కిరణ్ రావు

  కిరణ్ రావు


  సినిమా నిర్మాత, దర్శకురాలు మరియు స్క్రీన్ రైటర్ కిరణ్ రావు. ఇలా చెబితే ఆమెను గుర్తు పట్టలేము కానీ అమీర్ ఖాన్ భార్య అంటే ఇట్టే గుర్తు పట్టేయచ్చు. ఈమె హైదరాబాద్ లోని నిజాం కుటుంబానికి చెందిన వారు. ఆమె తాత వనపర్తి రాజా. వనపర్తి సంస్థానం జమీందార్ గా అయున పని చేశారు. ఆయన వనపర్తి యొక్క భూ స్వామ్యానికి బాధ్యత వహించారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే హీరోయిన్ అదితి రావు హైదరికి కజిన్ అవుతారు.

  అదితిరావు హైదరి

  అదితిరావు హైదరి

  అదితిరావు హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన మంత్రిగా ఉన్న సర్ ముహమ్మద్ అక్బర్ నజీర్ అలీ హైదరి కుటుంబానికి చెందిన వ్యక్తి. అంతే కాదు ఆయన వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కూడా. అంతే కాక అదితిరావు అస్సాం ప్రావిన్స్ యొక్క బ్రిటిష్ నియమించిన చివరి గవర్నర్ అయిన ముహమ్మద్ సలేహ్ అక్బర్ హైదరీ మనవరాలు కూడా.

  సైఫ్ అలీ ఖాన్

  సైఫ్ అలీ ఖాన్


  సైఫ్ అలీ ఖాన్ పటౌడి కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన తాత ఇఫ్తిఖర్ అలీఖాన్ పటౌడీ చివరి పటౌడీ, ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 26 వ సవరణ ద్వారా రాజా బిరుదులు నిషేధించబడ్డాయి. ఇఫ్తిఖర్ మరియు సైఫ్ అలీఖాన్ తండ్రి నవాబ్ మహమ్మద్ మన్సూర్ అలీ ఖాన్ సిద్దిఖీ పటౌడీ ఇద్దరూ భారత్ మరియు ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల కోసం ఆడారు. 'ఇబ్రహీం కోతి' అని పిలువబడే పటౌడీ ప్యాలెస్, ఈట్ ప్రే లవ్, వీర్ జారా, మంగల్ పాండే, మరియు లగాన్ వంటి అనేక చిత్రాల్లో కనిపించింది.

  మనీషా కొయిరాలా

  మనీషా కొయిరాలా

  మనీషా కొయిరాలా నేపాలీ మూలాలున్న రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆమెది నేపాల్ లో ముఖ్యమైన రాజకీయ కుటుంబం కూడా. ఆమె తల్లిదండ్రులు కొయిరాలా కుటుంబం అని పిలువబడే రాజ కుటుంబానికి చెందిన వారు. ఆమె తాత బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా 1950 మరియు 1960 లలో నేపాల్ ప్రధానిగా ఉన్నారు, ఆమె తండ్రి నేపాల్ మంత్రివర్గంలో పర్యావరణ, విజ్ఞాన మరియు సాంకేతిక మంత్రిగా పనిచేశారు. ఆమె మేనమామలు మరియు ఆమె పూర్వీకులు నేపాల్ పొలిటికల్ సర్కిల్ లో అనేక ముఖ్య పదవులు అనుభవించారు.

  ఇర్ఫాన్ ఖాన్

  ఇర్ఫాన్ ఖాన్

  ఈ మధ్యనే మనకు దూరం అయిన ఇర్ఫాన్ ఖాన్, రాజస్థాన్ లోని పఠాన్ కుటుంబంలో సహబ్ వాడే ఇర్ఫాన్ అలీ ఖాన్ గా జన్మించాడు. అతని తల్లి సయీదా బేగం రాజస్థాన్ సమీపంలోని టోంక్ అనే గ్రామానికి చెందిన వారు. ఆమె టోంక్ హకీమ్ కుటుంబానికి చెందిన మహిళ. ఇర్ఫాన్ కుటుంబానికి టోంక్ గ్రామం మొత్తం మీద అధికారం ఉంది. ఇర్ఫాన్ తండ్రి గ్రామానికి జమీందార్.

  రియా సేన్ - రీమా సేన్

  రియా సేన్ - రీమా సేన్


  రియా సేన్ - రీమా సేన్ ఇద్దరూ బాలీవుడ్లో చాలా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. కాని వారి వంశం గురించి కొద్దిమందికే తెలుసు. వారి నానమ్మ ఇలా దేవి బరోడా రాజు సయాజిరావ్ గైక్వాడ్ III కుమార్తె. ఇలా దేవి తల్లి ఇందిరా రాజే కూచ్ బెహర్ యువరాణి. అది కాకుండా అలా ఇలా దేవి చెల్లెలు గాయత్రి దేవి కూడా ఒకప్పుడు జైపూర్ మహారాణి.

  #HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Filmibeat Telugu
  భాగ్యశ్రీ

  భాగ్యశ్రీ


  సల్మాన్ ఖాన్‌తో కలిసి మైనే ప్యార్ కియాలో సుమన్ పాత్ర చేసి ఫేమస్ అయిన నటి భాగ్యశ్రీ మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన రాయల్ పట్వర్ధన్ కుటుంబానికి చెందినది. నిజానికి, ఆమె తండ్రి మహారాజా విజయ్ సింగ్ రాజే పట్వర్ధన్ ప్రస్తుతం సాంగ్లీకి రాజాగా వ్యవహరిస్తున్నారు కూడా. అన్నట్టు ఆమె మన డార్లింగ్ ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో కూడా నటిస్తోంది.

  English summary
  Many Celebrities of Bollywood belong to royal families in india. Here is the list of bollywood Celebrities who belong to royal families.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X