Divorce: ఐశ్వర్యరాయ్‌తో విడాకులు..అసలు అభిషేక్ బచ్చన్ ఏమంటున్నాడంటే
ఇటీవల భారతదేశం అంతా మాట్లాడుకున్న పెళ్లి వేడుక ఏదన్నా ఉంది అంటే అది భారత అపార కుబేరుడు ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ అలాగే గీత మర్చెంట్ ల వివాహం కోసమే అని చెప్పాలి. కాగా ఈ పెళ్లిని ఒక పెద్ద పండుగలా గత జూలై లో చేయగా వీరి పెళ్ళికి గాను ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు హాజరయ్యారు. అలాగే ఇండియన్ సినిమా నుంచి కూడా అనేకమంది స్టార్ నటీనటులు కూడా హాజరయ్యి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
కాగా వారు అందరికీలే అంబానీ ఇచ్చిన ఖరీదైన బహుమతులు కోసం కూడా అంతా మాట్లాడుకున్నారు. అయితే అక్కడికి హాజరైన పలువురు సినీ తారలు ఒకో రకంగా వైరల్ అయ్యారు కానీ ఈ అందరిలో ఒక్క జంట విషయం మాత్రం మరోలా పోర్ట్రెట్ అయ్యింది. కాగా ఆ జంటనే ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ అలాగే తన భర్త జూనియర్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ కుటుంబాల నడుమ కనిపించిన గ్యాప్ కోసం అని చెప్పాలి.

సాధారణంగా ఏ పెళ్ళికి అయినా ఒక కుటుంబం కలిసే వెళుతుంది కానీ వేరేవేరుగా వెళ్ళరు. కానీ ఆరోజు బచ్చన్ కుటుంబం అంతా ఒకవైపు ఐశ్వర్య రాయ్ ఒకవైపు కనిపించడం అనేక అనుమానాలకు తావు తీసింది. ఇక అక్కడ నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అంటూ పలు పుకార్లు గట్టిగా స్ప్రెడ్ అయ్యాయి. చాలా కాలం నుంచే ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఫ్యామిలీకి దూరంగానే ఉంటుంది అన్నట్టుగా వచ్చిన పుకార్లు మరింత హైలైట్ అయ్యాయి.
ఇక ఫైనల్ గా వీటికి జూనియర్ బచ్చన్ ఒక చెక్ పెట్టాడు. తమ విడాకుల వార్తలు తాను స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అసలు విడాకులు కోసం మేము ఎక్కడా చెప్పింది లేదు. కానీ ఎవరంతట వారు సొంత స్టోరీలు అల్లుకుంటున్నారు అని, మేము సెలెబ్రెటీస్ కాబట్టి ఇదంతా అటెన్షన్ కోసమే మీరు చేస్తున్నారు అని అర్ధం అవుతుంది.
నేను ఇంకా నా భార్యతో విడిపోలేదు మేమిద్దరం ఎప్పటికీ భార్యాభర్తలమే అన్నట్టుగా తన చేతికి ఐశ్వర్య తొడిగిన వెడ్డింగ్ ఉంగరాన్ని తమ ప్రేమకి చిహ్నంగా చూపిస్తూ అందరికీ గట్టి క్లారిటీ ఇచ్చాడు. దీనితో వీరిపై వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేసాడు అని చెప్పాలి. మరి ఇకనైనా వీరిపై ఈ వార్తలు ఆగుతాయో లేదో చూడాలి. ప్రస్తుతం అయితే బచ్చన్ ఫ్యామిలీ పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక అభిషేక్ బచ్చన్ పలు సినిమాలు ఇప్పుడు చేస్తుండగా వీటిలో తాను అయితే ధూమ్ సిరీస్ నుంచి తప్పుకున్నట్టుగా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఇక ఐశ్వర్య రాయ్ లాస్ట్ గా కోలీవుడ్ భారీ చిత్రాలు పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో కనిపించింది. వీటి తర్వాత మరే ఇతర సినిమాలు కూడా ఆమె ఓకే చెయ్యలేదు. ఈ పొన్నియిన్ సెల్వన్ సినిమాలు అయినా మణిరత్నం మీద అభిమానంతోనే చేసిందని టాక్.


Click it and Unblock the Notifications











