అజయ్ దేవగన్‌కు హెలికాఫ్టర్ ప్రమాదం అంటూ పుకార్లు.. అసలు నిజం ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కు ఏదో జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ వార్తతో పోలీసులు కూడా విసుగు చెందారు. సెలెబ్రిటీల విషయంలో ఇలాంటి పుకార్లు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నాయి. అజయ్ దేవగన్ కు ప్రమాదం జరిగిందనే వార్తతో పోలీసులు అలెర్ట్ కావడం, నిజం తీసుకున్న తరువాత తమ సమయం వృధా అయిందని ఆశ్చర్యపోవడం జరిగింది.

అసలు ఈ పుకారు ఏమిటో వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ప్రాంతంలో అజయ్ దేవగన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడని, హెలిక్టార్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో పుకారు దావానంలా వ్యాపించింది. ఆ ప్రాంత పోలీసులు అక్కడికి వెళ్లడం, ఇది ఫేక్ న్యూస్ అని తెలుసుకోవడం కూడా జరిగింది.

Here’s the truth about Ajay Devgn’s helicopter crashing

ఈ గాలి వార్త వారం రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారినట్లు తెలుసుకున్నాం అని పోలీస్ లు తెలిపారు. ఈ పుకారు సృస్టించిన వ్యక్తిని పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి గాలివార్తలు ఎవరూ షేర్ చేయవద్దని, విలువైన సమయం వృధా అవుతుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X