యువ హీరోకు సైబర్ నేరగాళ్ల టోకరా.. ప్యాన్ కార్డు అప్‌డేట్ చేయమని లక్షలు దోపిడి!

మొబైల్ టెక్నాలజీ ప్రజల జీవితాల్లోకి రావడంతో ప్రస్తుతం క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గిపోయి డిజిటల్ పేమేంట్స్ పెరిగిపోయాయి. ప్రతీ ఒక్కరు తమ మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. అయితే మొబైల్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్న సమయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయం తాజా హీరోకు జరిగిన సంఘటనతో అర్ధమైంది. యువ హీరో బ్యాంక్ అకౌంట్ నుంచి లక్షల రూపాయలు దోచుకోవడం సంచలనంగా మారింది. ఈ సైబర్ క్రైమ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

సాధారణంగా మొబైల్ లింకు ఉన్న బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఖాతాదారులకు అనేక మెసేజేస్ వస్తుంటాయి. మీ కేవైసీ (KYC) వివరాలు అప్‌డేట్ చేసుకోండి అంటూ మెసేజ్ వస్తుంటాయి. అలాంటి మెసేజ్ వచ్చిన బాలీవుడ్ హీరో అఫ్దాబ్ శివదాని.. ఆ మెసేజ్ బ్యాంక్ నుంచి వచ్చిందని దానికి స్పందించారు. దాంతో తన ఖాతా నుంచి 1,49,999 డెబిట్ అయ్యాయి. దాంతో అనుమానం వచ్చి చెక్ చేసుకోగా.. తన అకౌంట్‌లో నుంచి డబ్బు వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిందనే గ్రహించాడు. దాంతో ఆయన వెంటనే బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Hero Aftab Shivdasani looted Huge money by Cyber Fraudster sending message to update PAN card

బాంద్రా పోలీసులు తెలిపిన ప్రకారం.. అఫ్తాబ్ శివదాని మొబైల్‌కు ప్యాన్ కార్డు అప్ డేట్ చేసుకోమని ఓ మెసేజ్ వచ్చింది. ఆ క్రమంలో మీరు మీ మొబైల్ నంబర్, పిన్ నంబర్ టైప్ చేయమని అడిగారు. ఆ వివరాలు పొందు పరిచిన వెంటనే ఆయన అకౌంట్ నుంచి దాదాపు 1.5 లక్షలు మాయమయ్యాయి అని తెలిపారు.

బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నాం. సైబర్ క్రైమ్ విభాగానికి వివరాలు అందించాం. సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సైబర్ నేరగాళ్ల ఆచూకీ తెలుసుకొంటాం అని బాంద్రా పోలీసులు వెల్లడించారు.

Hero Aftab Shivdasani looted Huge money by Cyber Fraudster sending message to update PAN card

అఫ్తాబ్ శివదానీ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 420 కింద, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశాం. దర్యాప్తు కొనసాగుతున్నది అని బాంద్రా పోలీసులు తెలిపారు.

అఫ్తాబ్ శివదాని కెరీర్ విషయానికి వస్తే.. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఆయన సుపరిచితులు. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన మస్త్ సినిమా ద్వారా తెలుగు వారికి దగ్గరయ్యారు. అఫ్తాబ్ బాలనటుడిగా మిస్టర్ ఇండియా సినిమాతో గుర్తింపు తెచ్చుకొన్నారు. ఆ తర్వాత హీరోగా మారి హంగామా, ఆవారా పాగల్ దీవానా, గ్రేట్ గ్రాండ్ మస్తీ, గ్రాండ్ మస్తీ, కసూర్ లాంటి చిత్రాలతో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X