twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ సూసైడ్ కేసుతో లక్షల్లో సంపాదన.. రూ.500కోట్లు పరువు నష్టం దావా వేసిన స్టార్ హీరో

    |

    ఏదైనా ఘటన చోటు చేసుకుంటే నిజానిజాలు తెలుసుకోకుండానే తప్పుడు వార్తలు ప్రసారం చేయడం కామన్ గా మారింది. అలాంటి వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా యూ ట్యూబ్ లలో అయితే నిమిషాల్లో వందలాది ఫేక్ న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ వార్తను ఉపయోగించుకొని కొంతమంది యూ ట్యూబర్స్ కూడా వారి ఆదాయాన్ని పెంచుకున్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ హీరో తప్పుడు వార్తలు క్రియేట్ చేసే యూ ట్యూబర్ ని ఊహించని దెబ్బ కొట్టాడు.

    ఫెమాస్ అవ్వాలని ఫేక్ వార్తలు

    ఫెమాస్ అవ్వాలని ఫేక్ వార్తలు

    అసలు మ్యాటర్ లోకి వస్తే సుశాంత్ హత్యకు కారణాలు చెప్పే క్రమంలో యూ ట్యూబర్స్ కొందరు స్టార్ హీరోల పేర్లను కూడా మధ్యలోకి లాగారు. ముఖ్యంగా బీహార్‌కు చెందిన ఒక యూ ట్యూబర్ ఫేమస్ అవ్వాలని తన ఛానెల్ పాపులర్ అయ్యేలా చేసుకోవాలని బాలీవుడ్ సెలబ్రెటీలను టార్గెట్ చేస్తూ వచ్చాడు. ఇక చివరకు అతనికి అక్షయ్ కుమార్ షాక్ ఇచ్చాడు.

    అక్షయ్ కుమార్ అలా చేశాడు అంటూ..

    అక్షయ్ కుమార్ అలా చేశాడు అంటూ..

    రషీద్ సిద్దిఖీ తన యూ ట్యూబ్ ఛానెల్ లో సుశాంత్ హత్యకు కారణం అక్షయ్ కుమార్ అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేయడమే కాకుండా కీలక ఆధారాలను తారుమారు చేసే క్రమంలో రియా చక్రవర్తికి కూడా మద్దతు ఇచ్చినట్లు ఆరోపించాడు. అంతే కాకుండా సుశాంత్ ఎమ్.ఎస్.ధోని బయోపిక్ లో నటించడం కూడా అక్షయ్ కు ఎంతమాత్రం నచ్చలేదని రషీద్ సిద్దిఖీ తప్పుగా ఆరోపణలు చేశాడు.

    పరువు నష్టం దావా వేసిన హీరో

    పరువు నష్టం దావా వేసిన హీరో

    అలా ఫేక్ వార్తలు ప్రసారం చేయడంతో రషీద్ సిద్దిఖీ యూ ట్యూబ్ ద్వారా రెండు నెలల్లోనే భారీ ఆదాయాన్ని అందుకున్నాడు. మొత్తంగా నాలుగు నెలల్లో 15లక్షలకు పైగా సంపాదించడాని తెలుస్తోంది. ఇక అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని 500కోట్ల రూపాయల వరకు పరువు నష్టం దావా వేసి షాక్ ఇచ్చాడు.

    Recommended Video

    Mass Maharaj Ravi Teja Launches Seethaayanam Teaser
    అసలు విషయం బయటపడింది

    అసలు విషయం బయటపడింది

    గతంలో శివసేన నేతలపై కూడా ఇలానే ఫేక్ వార్తలు క్రియేట్ చేయడంతో కేసు నమోదైంది. ఇక పోలీసులు రంగంలోకి దిగదంతో గుట్టంతా బయటికొచ్చింది. ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు రషీద్ సుశాంత్ ఆత్మహత్య కేసును గట్టిగా ఉపయోగించుకున్న విషయం బయటపడింది. కొన్ని రోజుల్లోనే 3.70 లక్షలపైగా సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకున్న అతను వీడియోల ద్వారా మే నెలలో రూ. 296 సంపాదిస్తే.. సెప్టెంబర్ రూ. 6లక్షలకు పైగా సంపాధించాడని విచారణలో తెలిసింది.

    English summary
    One of them was Siddique, who became quite popular in youtube. Now, the latest update is that bollywood star hero Akshay Kumar has filed a defamation case of 500 crores against Siddique for taking his name in many of his videos on Youtube
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X