Divorce: నా భర్తకు మహిళతో అక్రమ సంబంధం.. నేను వదిలిపెట్టను.. డైవోర్స్‌పై భార్య షాకింగ్‌గా!

హిందీ సినిమా రంగంలో డైవోర్స్ వార్తలు విస్తృతంగా ప్రచారం అవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వార్త అడపదడపా మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా కొందరు హీరో, హీరోయిన్ల అఫైర్లు, బ్రేకప్ వార్తలు ఇండస్ట్రీని హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరో గోవిందాపై ఆయన భార్య ఇటీవల పింక్ విల్లా, ఇతర జాతీయ ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన ఆరోపణలు మరింత సంచలనం రేపాయి. వారిద్దరి మధ్య డైవోర్స్ వివరాల్లోకి వెళితే..

గతేడాదిగా హిందీ సినిమా రంగంలో గోవిందా, ఆయన భార్య సునీత అహుజా దాంపత్య జీవితంలో చోటు చేసుకొన్న విభేదాలు జాతీయ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయితే వారిద్దరూ సపరేట్‌గా ఉంటున్నారు. భర్త గోవిందా కూడా వేరే ఇంటిలో ఉంటున్నాడు. తన భర్తకు కోర్టు నోటీసులు జారీ చేశారనే వార్త కూడా బయటకు వచ్చిది. దాంతో వారి డైవోర్స్ తీసుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపించింది.

Hero Govinda wife Sunitha

అయితే భర్తకు దూరంగా ఉంటున్న సునీత తాజాగా యూట్యూబర్‌గా మారారు. ఈ నేపథ్యంలో ఆమె జాతీయ మీడియాకు ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన కాపురంలో చోటుచేసుకొన్న కలతలు గురించి స్పష్టం చేశారు. తనకు 2025 సంవత్సరం చాలా చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాకు తీవ్రమైన అసంతృప్తిని మిగిల్చింది అని అన్నారు.

నా భర్త గోవిందాకు అక్రమ సంబంధంపై క్లారిటీ ఇచ్చారు. ఆయనకు మరో అమ్మాయితో అఫైర్ ఉంది. ఆ అమ్మాయి మరాఠీ హీరోయిన్ కాదు. హీరోయిన్లు కాపురాల్లో చిచ్చు పెట్టే అంత చెడ్డవారు కాదు అని అన్నారు. నా భర్త ఇలాంటి వ్యవహారాలను ముగింపు పలికి రియలైజ్ కావాలి. ఆయన తిరిగి మామూలుగా వ్యవహరించాలి అని సునీత అన్నారు.

గోవింద జీవితంలో ముగ్గురు మహిళలే కీలకమని భావించాం. ఆమె తల్లి, భార్య, కూతురు అని అనుకొన్నాం. కానీ ఆయన లైఫ్‌లోకి నాలుగో మహిళా రావడం జీర్ణించుకోలేనిది. ఆయన చుట్టు ఉండే చెంచాల వల్ల ఆయనలో ఇలాంటి మార్పు, నిర్ణయాలు జరిగాయి. తన పక్కన ఉన్న వాళ్లను దూరంగా పెట్టి.. తన ప్రొఫెషనల్ వర్క్, డబ్బు గురించి ఆలోచించాలి అని ఆమె అన్నారు.

గోవిందా అంటే నాకు ఇప్పుడే ప్రేమ లేదు. కేవలం ఆయన డబ్బుపైనే దృష్టి ఉంది అని క్లారిటీ ఇచ్చేశారు. ఆయన నుంచి దూరం కావడం లేదు. ఆయన ఎప్పుడూ నా వాడే. గోవిందా మరోకరి వ్యక్తి కాడు. కాబోడు. నా భర్తగానే నాతోనే ఉంటాడు అని డైవోర్స్ రూమర్లకు తెర దించారు.

More from Filmibeat

Read more about: govinda sunitha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X