యంగ్ హీరో ఇంటి పక్కకి మకాం.. లగ్జరీ ఇల్లు కొన్న నటుడి మాజీ భార్య , ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ సూపర్‌స్టార్ సైఫ్ అలీఖాన్ పేరు ఇటీవల వార్తల్లో బాగా వినిపిస్తోంది. దుండగుడి దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఈ హీరో తిరిగి సినిమాలు, షూటింగ్‌లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతటి దుర్ఘటన తర్వాత కూడా విశ్రాంతి లేకుండా తిరిగి పనిలో నిమగ్నం కావడం వృత్తి పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనం. అయితే సైఫ్ అలీఖాన్ గురించిన పాత విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చి చర్చనీయాంశమవుతున్నాయి.
రెండ్రోజుల క్రితం సైఫ్ అలీఖాన్ ఇంటిపక్కన ఒకప్పుడు నివసించిన బాలీవుడ్ హీరోయిన్ షీబా ఆకాశ్‌దీప్ ఆయన కారణంగా తాను ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆకాశ్‌దీప్ ఒకప్పుడు సైఫ్ ఆయన మొదటి భార్య అమృతా సింగ్‌కు స్నేహితురాలు. అయితే అనుకోకుండా ఓ రోజున షీబాకు ఎంతో ఇష్టమైన పెంపుడు కుక్కను.. సైఫ్ - అమృతల కుక్క చంపేసింది.

ఈ సంఘటన తర్వాత మేం మాట్లాడుకోవడం మానేశామని షీబా చెప్పింది. సైఫ్ తనకు క్షమాపణలు చెప్పడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ తాను క్షమించలేకపోయానని షీబా తెలిపారు. అది నాకు ఇష్టమైన కుక్క కావడంతో నా మనసు ముక్కలైందని.. ఇల్లు అమ్మేసి రాత్రికి రాత్రే వెళ్లిపోయానని షీబా గుర్తుచేసుకున్నారు.
తాజాగా సైఫ్ అలీఖాన్ మాజీ భార్య అమృతా సింగ్ వార్తల్లోకెక్కారు. 80-90 దశకంలో బాలీవుడ్‌ను ఊపేసిన అమృతను సైఫ్ ఇష్టపడ్డారు. ఇద్దరి మధ్యా ఎంతో వయసు తేడా ఉన్నప్పటికీ 1991లో ఒక్కటయ్యారు. ఈ జంటకు సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ జన్మించారు. అయితే 2004లో మనస్పర్ధలు రావడంతో ఈ జంట విడిపోయింది. భరణం కింద అమృత రూ.5 కోట్లు డిమాండ్ చేయగా.. 2.5 కోట్లు ఇచ్చాడు సైఫ్, మిగిలిన మొత్తాన్ని కొద్దికొద్దిగా చెల్లిస్తున్నారు.

అంతేకాదు ఇబ్రహీంకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా అమృతకు రూ.లక్ష చొప్పున పంపించేవారు సైఫ్. ఇందుకోసం తాను ఎంతో కష్టపడినట్లు సైఫ్ అలీఖాన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. తానేమీ షారుఖ్ ఖాన్‌ని కాదని, తన వద్ద అంత డబ్బు లేదని సైఫ్ తెలిపారు. విడిపోయినప్పటికీ అమృతతో ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తున్నారు.
తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం జుహులో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్నారు అమృతా సింగ్. ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అందించిన వివరాల ప్రకారం రూ.18 కోట్ల పైమాటే ఉంటుందట. నూతన్ లక్ష్మీ కో ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీలో 2,712 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్‌మెంట్ ఉందట. దీనిని కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ కింద రూ.90 లక్షలు , రిజిస్ట్రేషన్ ఛార్జ్ కింద రూ. 30 వేలు చెల్లించారు అమృత. ఆమె ఇంటికి పక్కనే బాలీవుడ్ సెలబ్రెటీలు కార్తీక్ ఆర్యన్ , వరుణ్ ధావన్, జాన్వీ కపూర్, శక్తి కపూర్ తదితరులు నివసిస్తున్నారు. ప్రస్తుతం అమృత ఇంటి వ్యవహారం బీటౌన్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











