ఒక్క రాత్రికి అక్కడ రేటెంతో చెప్పిన స్టార్ హీరో భార్య.. స్పెషల్ రొమాంటిక్ పోస్ట్!
బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి రీమేక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న షాహిద్ కపూర్ ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమాలు హిట్టయితే అతని ఫోకస్ ఎక్కువగా ఇక్కడే పడుతోంది. ఇక అతనికి సంబంధించిన వార్తలు కూడా సౌత్ ఇండస్ట్రీలో బాగానే వైరల్ అవుతున్నాయి. ఇక అతని భార్య సతీమణి మీరా రాజ్‌పుత్ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేయడంతో నిమిషాల్లోనే అది వైరల్ గా మారింది. హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట రొమాంటిక్ మాటలతో నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్
షాహిద్ కపూర్ సతీమణి మీరా రాజ్ పుత్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా ఆమె ఆరోగ్య చిట్కాల నుండి మేకప్ హ్యాక్‌ల వరకు అన్ని విషయాలను క్లుప్తంగా తన అభిమానులతో పంచుకుంటోంది. ఇక అనేక అనారోగ్య సమస్యలపై కూడా సమాధానం ఇస్తుంటారు. మొత్తానికి సోలోగానే మీరా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంది.
విమర్శలు కూడా
భర్త స్టార్ హీరో అయినప్పటికీ కూడా మీరా తన లైన్ లో అతని స్టార్ డమ్ ను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఆమె ఎలాంటి విషయం చెప్పినా కూడా ఇటీవల కాలంలో హాట్ టాపిక్ గా మారుతోంది. అప్పుడప్పుడు అనవసరంగా కొన్ని వివాదస్పద వ్యాఖ్యలతో కూడా ఆమె నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

మాల్దీవుల్లో సందడి
ఇక రీసెంట్ గా తనకు ఎంతో ఇష్టమైన మాల్దీవుల్లో విహార యాత్రను చూసేయండి అంటూ ఒక హాలీడే ట్రిప్ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేసింది. ఆ వీడియోలో మీరా ఒక అందమైన విల్లాను చూపిస్తూ తాము బస చేసింది కూడా ఇక్కడే అంటూ తీరం తనకు ఎంతో దూరంలో లేదని వివరణ ఇస్తూ సముద్ర అలలను కూడా అందంగా షూట్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందని తెలిపింది.

ఒక్క రాత్రికి 3లక్షలు
ఇక ఆ వీడియోలో మీరా చూపించిన విల్లాలో ఒక్క రాత్రి బస చేసేందుకు సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చవుతుందని తెలిపింది. ఆ స్థాయిలో ఖర్చు అయినా పర్లేదు కానీ మళ్లీ ఆ రోజులు మళ్ళీ మళ్ళీ అనుభూతి పొందాలి ఉందని తెలిపింది. సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్లాలని ఉందంటూ కూడా మీరా వివరణ ఇచ్చింది.
Recommended Video

ప్రేమ, పెళ్లి.. పిల్లలు
ఇక గత నెలలోనే షాహిద్ ఫ్యామిలీతో కలిసి మాల్దీవులలో ఎంజాయ్ చేశాడు. ఇక ట్రిప్ అనంతరం మీరా డ్రెస్సింగ్‌పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ విషయాన్ని ఈ దంపతులు పెద్దగా పట్టించుకోలేదు. ఇక మీరా రాజ్ పుత్ ను 2015లో పెళ్లి చేసుకున్న ఈ షాహిద్ ఎప్పటికప్పుడు వారి ప్రేమకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక వీరికి 2016 ఆగస్టు 26న కూతురు మిషా జన్మించింది. 2018 సెప్టెంబర్ 5న కొడుకు జైన్ జన్మించాడు.


Click it and Unblock the Notifications











