For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘తూనీగ తూనీగ’ హీరోయిన్‌తో త్వరలోనే నా వివాహం: వెల్లడించిన హీరో సుశాంత్

|

ప్రముఖ నిర్మాత కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన 'తూనీగా తూనీగా' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రెహా చక్రవర్తి. ఈ సినిమా తర్వాత ఆమె నేరుగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలకు కూడా హోస్ట్‌గా వ్యవహరించింది. వీటన్నింటి వల్ల ఆమె పెద్దగా హైలైట్ కాలేదు కానీ, ఓ హీరోతో ప్రేమాయణం నడిచి బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఇంతకీ ఈమె ప్రేమించిన హీరో ఎవరనే కదా మీ సందేహం..?

రెహా చక్రవర్తి డేటింగ్ చేస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో. గతంలో ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ 'ధోనీ: అన్‌టోల్డ్ స్టోరీ' వచ్చిన తర్వాత మాత్రం దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నో భారీ సినిమాలో అవకాశాలు దక్కించుకోవడంతో బాలీవుడ్‌లోని స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఇప్పుడు ఇదే స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

Hero Sushant Singh Rajput Will Marry Rhea Chakraborty

రెహా చక్రవర్తితో సుశాంత్ డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో వార్త బీ టౌన్‌లో సంచలనం అవుతోంది. ఇటీవల ఈ జంట లడక్ టూర్ వెళ్లిందని, అక్కడ బాగా ఎంజాయ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, జూలై 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా సుశాంత్ డైమండ్ పెండెంట్ ఒకటి గిఫ్ట్‌గా ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంతేకాదు, ఆరోజున సుశాంతే ఆమెతో కేక్ కట్ చేయించాడన్న గుసగుసలూ వినిపించాయి.

తాజాగా తమ మధ్య ఉన్న బంధం గురించి సుశాంత్ ఓపెన్ అయ్యాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. 'మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ఇదే విషయాన్ని రెహాతో సైతం చెప్పాను. ఆమె నిర్ణయం కోసం వేచి చూస్తున్నాను' అని వెల్లడించాడు. దీంతో సుశాంత్ చెప్పింది పెళ్లి గురించే అని అర్థం అయిపోయింది. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది.

English summary
Sushant Singh Rajput and Rhea Chakraborty. If a report in Mumbai Mirror is to be believed, Sushant is ready to take the plunge and marry Rhea, even though they began dating only earlier this year.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more