India Vs Pak సెంచరీతో రఫాడించిన కేఎల్ రాహుల్.. చీకటి తర్వాత వెలుగు.. భార్య అతియాశెట్టి ఎమోషనల్ పోస్టు!
పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ అంటే భారతీయులందరికి పండుగ లాంటి వాతావారణం నెలకొన్ని ఉంటుంది. చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌పై ప్రతీ ఆటగాడు తన మనసు పెట్టి ఆడాలనుకొంటారు. భారత్ ప్రతిష్టను ఆటగాళ్లే కాదు.. క్రీడాభిమానులు కూడా దిల్‌పై తీసుకొంటారు. భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కొలొంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చేసిన సెంచరీలో క్రికెట్ అభిమానుల్లో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపాయి. అయితే తన భర్త కేఎల్ రాహుల్ చేసిన సెంచరీపై భార్య అతియాశెట్టి చేసిన పోస్ట్ ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయింది. తన భర్త గురించి అతియా శెట్టి చేసిన ఎమోషనల్ పోస్టు ఏమిటంటే?
పాకిస్థాన్‌తో మ్యాచ్ కేఎల్ రాహుల్‌కు కీలకంగా మారింది. ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ గాయపడి ఆటకు దూరమ్యారు. నాలుగు నెలల తర్వాత కేఎల్ రాహుల్ జట్టులో చోటు సంపాదించారు. సెప్టెంబర్ 10వ తేదీన అంటే ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది. ఆట ఆగిన సమయంలో 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది.

సోమవారం రిజర్వు కావడంతో ఆగిన ఆటను అదే స్కోరుతో ముందుకు తీసుకెళ్లారు. పాకిస్థాన్ బౌలర్లను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆడిన తీరు ప్రేక్షకులను మైదానంలో హుషారెత్తించింది. నాలుగు నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన రాహుల్ 111 పరుగులు చేశాడు. భారత్ స్కోర్ 356 పరుగులు స్కోరు బోర్డుపై ఉండటానికి రాహుల్ తన వంతు సహకారం అందించారు.
కేఎల్ రాహుల్ సాధించిన స్కోరును చూసి భార్య అతియా శెట్టి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టుతో తన ఎమోషన్స్ చాటుకనొన్నది. స్కోరు బోర్డుపై కేఎల్ రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులు చేసినట్టు ప్రదర్శించిన కార్టును షేర్ చేసింది. అలాగే సెంచరీ కొట్టిన బంతిని ఆడిన కేఎల్ రాహుల్ వీడియోను కూడా పోస్టు చేసింది. అలాగే సెంచరీ కొట్టిన తర్వాత ఆకాశంలోకి చూస్తూ భగవంతుడికి మొక్కుతున్న ఫోటోను షేర్ చేసింది.

కేఎల్ రాహుల్ సెంచరీ తర్వాత ఫోటోలు, వీడియోలతోపాటు ఎమోషనల్‌గా సందేశాన్ని పంచుకొన్నది. ఎప్పుడో ఒకప్పుడు చీకటి రాత్రులకు ముగింపు ఉంటుంది. సూర్యోదయం తప్పక ఉంటుంది. నీవంటే నాకు సర్వస్వం. ఐ లవ్ యూ అంటూ అతియా శెట్టి తన మనసులోని భావాలను బయటపెట్టింది.
అతియా శెట్టి పెట్టిన పోస్టుకు నెటిజన్లు, కేఎల్ రాహుల్ అభిమానులు ఎమోషనల్‌గా స్పందించారు. అన్ని విమర్శలకు రాహుల్ బ్యాటుతో సమాధానం చెప్పాడు. వాట్ ఏ కమ్ బ్యాక్. రాహుల్‌ను వరల్డ్ కప్ టీమ్ నుంచి తప్పించాలని కుట్ర పన్నిన వారికి నేను 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాను అంటూ నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. రాహులియన్స్‌కు ఇది పండుగ లాంటి సమయం అంటూ నెటిజన్లు పోస్టులతో విజృంభిస్తున్నారు.


Click it and Unblock the Notifications











