twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకప్ రూట్లో వరుణ్ తేజ్ హీరోయిన్.. బాలీవుడ్ హీరోతో పెళ్లి వరకు వచ్చి సడన్ ట్విస్ట్?

    |

    సినిమా ప్రపంచంలో కొంతమంది నటీనటులు ఎంత త్వరగా ప్రేమలో పెడతారో అంతే త్వరగా బ్రేకప్ చెప్పేస్తుంటారు. ఇక మరికొందరు పెళ్లి చేసుకున్న తరువాత కూడా డివోర్స్ కూడా వేగంగానే తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలోగిస్తోంది. ఇక రీసెంట్ గా వరుణ్ తేజ్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఒక హీరోయిన్ బాలీవుడ్ హీరోతో పెళ్లి వరకు వెళ్లి హఠాత్తుగా బ్రేకప్ చెప్పేసింది. ఆ బ్యూటీకి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

    టాలీవుడ్ నుంచి..

    టాలీవుడ్ నుంచి..

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మంచి క్రేజ్ అందుకున్న బ్యూటీ దిశా పటాని. ఈ బ్యూటీ మోడల్ గా క్రేజ్ అందుకున్న అనంతరం మొదట వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి కూడా చాలా వేగంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయిపోయింది.

    గ్లామర్ తో మంచి క్రేజ్

    గ్లామర్ తో మంచి క్రేజ్

    తెలుగులో లోఫర్ సినిమా డిజాస్టర్ అయిన తరువాత దిశా పటాని గ్లామర్ కు మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక మరికొందరు మిడియం రేంజ్ హీరోల సినిమాలలో కూడా ఈ బ్యూటీకి అవకాశాలు అయితే వచ్చాయి. కానీ ఆమె ఆ తరువాత మళ్ళీ ఎందుకో తెలుగు సినిమాలు చేయలేదు. ఆ తరువాత డైరెక్ట్ గా బాలీవుడ్ లో అవకశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది.

    మంచి నటిగా

    మంచి నటిగా

    బాలీవుడ్ లో మొదట ఎమ్ఎస్.ధోని బయోపిక్ లో ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించిన దిశా ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఆమె చాలా తొందరగానే మిగతా సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది. మోడల్ కావడంతో బికినీలో కూడా కొన్ని సినిమాల్లో హైలెట్ గా నిలిచింది.

     పెళ్లికి రెడీ

    పెళ్లికి రెడీ

    ఇక కుంగ్ ఫు, భాగి సినిమాలతో అమ్మడు అక్కడ టైగర్ ష్రాఫ్ కు చాలా క్లోజ్ అయిన విషయం తెలిసిందే. రెండు సినిమాలతోనే వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారిపోయింది. ఇక వారి ప్రేమకు సంబంధించిన ఎన్ని వార్తలు వచ్చినా కూడా ఈ ఐదేళ్ళ కాలంలో పెద్దగా స్పందించింది లేదు. ఇక పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలోనే చాలా వార్తలు వచ్చాయి.

    బ్రేకప్?

    బ్రేకప్?

    ఇక ఇప్పుడు హఠాత్తుగా వారు పెళ్లికి సిద్ధమవుతున్నారు అనే సమయంలో బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ కారణంగా దిశా పటాని బ్రేకప్ చెప్పేసి తన సినిమాలతో బిజీ అయినట్లు సమాచారం. ఇటీవల పెళ్లి చెలుకుందామని ఇద్దరు కూడా పెద్దలను ఒప్పించే సమయంలోనే ఎదో జరిగినట్లు బాలీవుడ్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ఆ జంట ఏదైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ ఇస్మార్ట్ శంకర్ రీమేక్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దిశా పటాని బాలీవుడ్ లోనే మరికొన్ని సినిమాలు చేస్తోంది. ఇక టాలీవుడ్ కూడా ఈ బ్యూటీ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

    English summary
    Heroine disha patani breakup with bollywood star hero
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X