For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రహస్యంగా యువ హీరోతో శ్రీదేవి కూతురు.. మీడియా రాకతో గేటు దూకి జంప్

  |

  బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ రోజురోజుకు గట్టిగానే పెరుగుతోంది. గతంతో ఫాలొస్తే అమ్మడు తన లుక్స్ తో నెటిజన్లను గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ లలో స్టార్ సెలబ్రెటీలు ఎంత మంది ఉన్నా కూడా కెమెరాలు ఎక్కువగా ఆమెనే ఫోకస్ చేస్తుంటాయి. అయితే చాలా రోజుల తరువాత జాన్వీపై ఒక న్యూస్ వైరల్ గా మారింది.

  యువ హీరోతో జాన్వీ..

  యువ హీరోతో జాన్వీ..

  బాలీవుడ్ సినీ తారలు ఎంత ప్రైవసీ మెయింటైన్ చేసినప్పటికి మీడియా మాత్రం చాలా లోతుగానే రహస్యాలను రాబట్టేందుకు ప్రయత్నం చేస్తుంటుంది. ఇక హీరోయిన్స్ కి సంబంధించిన రొమాంటిక్ లైఫ్ గురించి ఒక చిన్న పాయింట్ బయటకు లీక్ అయినా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల జాన్వీ కూడా ఒక యువ హీరోతో చాలా క్లోజ్ గా ఉన్నట్లు అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

  క్రేజ్ పెంచుకుంటున్న కార్తిక్ ఆర్యన్

  క్రేజ్ పెంచుకుంటున్న కార్తిక్ ఆర్యన్

  జాన్వీ కపూర్ తో సన్నిహితంగా ఉన్నా ఆ యువ హీరో మరెవరో కాదు.. ల‌వ్ ఆజ్ క‌ల్ సినిమాతో ఇటీవల బాక్సాఫీస్ హిట్ అందుకున్న కార్తీక్ ఆర్యన్. ఈ మధ్య కాలంలో ఈ యువ హీరోకు కూడా అభిమానుల సంఖ్య గట్టిగానే పెరుగుతోంది. వరుసగా రొమాంటిక్ లవ్ సినిమాలతో యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అందరికంటే విభిన్నంగా కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం దోస్తానా 2 అనే సినిమా చేస్తున్నాడు.

  వారిద్దరి మధ్య ఏదో నడుస్తోంది

  వారిద్దరి మధ్య ఏదో నడుస్తోంది

  అయితే జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన ల మధ్య ఏదో నడుస్తోందనే పుకారు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా జాన్వీ గేటు దూకి పారిపోవడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ ఇతర ఇండస్ట్రీలలో కూడా హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా జాన్వీపై ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి.

  ముందే పసిగట్టిన జాన్వీ.. జంప్ చేసి..

  ముందే పసిగట్టిన జాన్వీ.. జంప్ చేసి..

  అసలు ఏం జరిగిందంటే.. ఒక బిల్డింగ్ బయటనుంచి జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్ నడుచుకుంటూ వస్తుండగా సడన్ గా బాలీవుడ్ మీడియాకు చెందిన ఫొటో గ్రాఫర్లు వారిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నం చేశారు. విషయం ముందే పసిగట్టిన జాన్వీ కెమెరాల యాంగిల్స్ సెట్ చేసుకునే లోపే గేటు దూకి పారిపోయింది. కానీ కార్తిక్ మాత్రం ఆమె వెళ్లిపోతున్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. పెద్దగా ఆందోళన చెందకుండా కెమెరాలకు పొజిచ్చాడు.

  Recommended Video

  #MaaVinthaGadhaVinuma: Seerat Kapoor, Siddhartha Chit Chat With Allu Aravind || Filmibeat Telugu
  కావాలనే అలా చేశారా..?

  కావాలనే అలా చేశారా..?

  అయితే ఈ విధంగా చేయడానికి గల కారణం ఏమిటనే దానిపై కూడా అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. నిజంగానే వారి మధ్యలో ఏదైనా ఉందా? లేక నిర్మాత కరణ్ జోహార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా క్రియేట్ చేశారా అనే సందేహాలు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే వీరు దోస్తానా సినిమాలో జంటగా నటిస్తున్నారు. గతంలో కరణ్ హీరో హీరోయిన్స్ తో ఇలాంటి స్టంట్స్ చాలానే వేయించాడు. కొల్లిన్ డి కున్హా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Khushi kapoor play with janvhi kapoor in different style, janhvi shares her sister cute video in instagram, and netizens comments in different style. Recently janhvi rejects some telugu offers
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X