చీకటి గదిలో హీరోతో శృంగారం.. కట్ చేస్తే భయంతో పరుగులు: బయటపెట్టిన అర్జున్ రెడ్డి హీరోయిన్
ఈ మధ్య కాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. అయితే, వారిలో అతి తక్కువ మంది మాత్రమే మొదటి చిత్రంతోనే సెన్సేషన్ అయ్యారు. అలాంటి వారిలో షాలినీ పాండే ఒకరు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో హాట్ టాపిక్ అయిపోయిన ఈ అమ్మడు.. అప్పటి నుంచి చాలా సినిమాల్లో నటించింది. అయితే, ఇప్పుడు టాలీవుడ్ కంటే వేరే భాషల్లోనే ఎక్కువగా బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న షాలినీ పాండే.. శృంగార సన్నివేశం గురించి మాట్లాడింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే!
అర్జున్ రెడ్డితో సంచలనం:షాలినీ పాండే 2017లో వచ్చిన 'అర్జున్ రెడ్డి' అనే చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఈ చిత్రంలో షాలినీ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అంతలా ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆమెకు విశేషమైన గుర్తింపుతో పాటు ఫాలోయింగ్ కూడా లభించింది.

ఆ సినిమాల్లోనూ చేసినా:షాలినీ పాండే 'అర్జున్ రెడ్డి' తర్వాత తెలుగులో వరుసగా సినిమా ఆఫర్లను అందుకోలేకపోయింది. కానీ, 'మహానటి', 'యన్.టి.ఆర్.. కథానాయకుడు' వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ, వీటితో ఆమెకు సరైన పేరు రాలేదు. ఆ తర్వాత '118', 'ఇద్దరి లోకం ఒక్కటే', 'నిశ్శబ్దం' వంటి చిత్రాల్లోనూ నటించింది. కానీ, పెద్దగా హిట్లను ఖాతాలో వేసుకోలేదు.
వేరే భాషల్లో వరుసగానే:టాలీవుడ్‌లో సరైన రీతిలో ఆఫర్లను సొంతం చేసుకోలేకపోయినా.. షాలినీ పాండే మాత్రం తమిళం, హిందీలో ఎన్నో సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో '100% కాదల్', 'గొరిల్లా', వంటి చిత్రాలను చేసి పేరు తెచ్చుకుంది. అలాగే, హిందీలో 'మేరీ నిమ్మో', 'బమ్‌ఫాడ్', 'జయేష్ భాయ్ జోర్దార్' వంటి సినిమాలతో వచ్చి సత్తాను చాటుకుంది.

ఆ సినిమాలో చేసిందిగా:అందంతో పాటు టాలెంట్‌తో మెప్పిస్తూ విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న షాలినీ పాండే.. ప్రస్తుతం ఒక్కటంటే ఒక్క సినిమాలోనే నటిస్తోంది. అది కూడా హిందీలో 'మహారాజా' అనే ఫిల్మ్ చేసింది. దీనితో పాటు ఆమె కొన్ని వెబ్ సిరీస్‌లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా తెలుగులో కొన్ని కథాపరమైన చర్చల్లో సైతం పాల్గొన్నట్లు ప్రచారం జరుగుతోంది.
శృంగార సన్నివేశంతో:షాలినీ పాండే రీసెంట్‌గా 'మహారాజా' అనే సినిమాలో నటించినట్లు ముందుగానే చెప్పుకున్నాం. సిద్దార్థ్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రంలో జునైద్ ఖాన్ , జైదీప్ అహ్లవ్‌లతో పాటు ఈ అమ్మడు ప్రధాన పాత్రను పోషించింది. 1800 కాలం నాటి కథతో రూపొందిన ఈ సినిమాలో షాలినీ పాండే శృంగార సన్నివేశంలో నటించింది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా వచ్చింది.

స్పందించిన హీరోయిన్:'మహారాజా' సినిమా మే నెలలో విడుదలైంది. ఇప్పుడు దీన్ని ఓటీటీలో తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా షాలినీ పాండే ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగానే సదరు చిత్రంలో ఆమె చేసిన ఆ శృంగార సన్నివేశం గురించి మాట్లాడింది. 'శృంగార సన్నివేశం చీకట గదిలో చిత్రీకరిస్తున్నప్పుడు ఒక్కసారిగా బయటకు పరుగు తీసాను' అని చెప్పుకొచ్చింది.
భయంతో పరిగెత్తానని:ఆ తర్వాత షాలినీ పాండే కంటిన్యూ చేస్తూ.. 'చీకటి గదిలో చేసిన ఆ శృంగార సన్నివేశం నాపై ఎలాంటి ప్రభావం చూపించిందో తెలియదు గానీ.. అక్కడ ఉండాలంటే చాలా భయమేసింది. అందుకే అలా హఠాత్తుగా వెలుతురులోకి వచ్చేశా. తర్వాత నా పరిస్థితిని దర్శకుడికి వివరించాను. ఆయన నన్ను అర్దం చేసుకుని ముందుకెళ్లారు' అంటూ అసలు మేటర్ బయటపెట్టింది.


Click it and Unblock the Notifications











