పెగ్నెన్సీతోనే షూటింగ్‌కు కరీనా కపూర్.. గర్భం కనిపించకుండా అమీర్ తంటాలు..
పెళ్లైన హీరోయిన్ తో సినిమా అంటే ఒకప్పుడు చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటూ కామెంట్స్ వచ్చేవి. ఎందుకంటే ఆడియెన్స్ పెళ్లైన నటీమణులను హీరోయిన్స్ గా చూడటానికి ఏ మాత్రం ఇష్టపడరని ఇండస్ట్రీలో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉండేది. కానీ ఈ రోజుల్లో అలాంటి సెంటిమెంట్స్ కి స్టార్ హీరోయిన్స్ బ్రేక్ వేస్తున్నారు. పెళ్లికి నటనకు ఏ మాత్రం సంబంధం లేదని వారి టాలెంట్ తో జనాలను ఆకర్షిస్తున్నారు. కరీనా కపూర్ అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

నాలుగు పదుల వయసులో కూడా..
నాలుగు పదుల వయసున్న కరీనా అందం చూస్తే ఎవరైనా సరే పాతికేళ్ల అమ్మాయని అనుకుంటారు. ఒక బాబుకు జన్మనిచ్చిన కూడా ఇంకా ఆమె అందంతో ఎలాంటి మార్పు రాలేదు అనేలా నిత్యం నెటిజన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటూనే ఉంటుంది. ఇక రెమ్యునరేషన్ లో కూడా ఆమె రేంజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక మీడియం రేంజ్ హీరోల మాదిరిగా రెమ్యునరేషన్ అందుకుంటోంది.

ప్రెగ్నెన్సీ ఫొటోస్ వైరల్
ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఇటీవల సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ క్లారిటి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందే కరీనాకు సంబంధించిన ఫొటోలు చాలానే వైరల్ అయ్యాయి. ఆమె ఒక షూటింగ్ లో కూడా పాల్గొంది. సడన్ గా కొంచెం లావుగా కనిపించడంతో రూమర్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

షాక్ అయిన అమీర్ ఖాన్ టీమ్
రూమర్స్ ఎక్కువైనపుడే సైఫ్ అలీ ఖాన్ కూడా అధికారికంగా ప్రకటించారు. అంతా బాగానే ఉంది గాని కరీనాతో సినిమాలు చేసేందుకు కొందరు నిర్మాతలు లాక్ డౌన్ కి ముందే ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా అమీర్ ఖాన్ లాల్ చద్దా సినిమా షూటింగ్ ని కూడా కొంత పూర్తి చేసింది. ఇక త్వరలోనే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసికుంటూ ఉండగా కరీనా ప్రెగ్నెంట్ అనగానే షాక్ అయ్యారట.

ప్రెగ్నెన్సీ కనిపించకుండా..
ఇక కరీనా కపూర్ తో ఇప్పటికే షూటింగ్స్ గురించి మాట్లాడిన లాల్ చద్దా టీమ్ ఆమెకు సౌకర్యంగానే ఉంటేనే షూటింగ్ లో పాల్గొనాలని అన్నారట. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా షూటింగ్ లో పాల్గొంటాను అంటూ సమాధానం ఇవ్వడంతో సినిమా యూనిట్ సభ్యులు కరీనా బేబి బంప్ ను వెండితెరపై కనిపించకుండా VFXతో మ్యానేజ్ చేయనున్నారట.
Recommended Video

గతంలో సల్మాన్ ఖాన్ కూడా..
కరీనా ప్రెగ్నెన్సీలో ఉన్నట్లు సినిమాలో ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా గ్రాఫిక్స్ సహాయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి కరీనా ఏ విధంగా కష్టపడుతుందో చూడాలి. అయినా గ్రాఫిక్స్ లో స్టార్స్ యొక్క రూపురేఖలను మార్చడం కొత్తేమి కాదు. గతంలో సల్మాన్ ఖాన్ కిక్ సినిమాలో గ్రాఫిక్స్ ఉపయోగించే సిక్స్ ప్యాక్ తో కనిపించాడు.


Click it and Unblock the Notifications











