»   » కాపురాన్ని కూల్చిన ప్రేయసితో.. మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి

కాపురాన్ని కూల్చిన ప్రేయసితో.. మ్యూజిక్ డైరెక్టర్ పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్లి వేడుకలతో బాలీవుడ్ కళకళలాడుతున్నది. మొన్న అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ పెళ్లి, నిన్న సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా వివాహం, నేహా దూపియా పెళ్లి కార్యక్రమాలతో సందడి నెలకొన్నది. ప్రస్తుతం కొత్తగా బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా వివాహ వార్త తెరపైకి వచ్చింది. నేడు (మే 11) తన ప్రేయసి సోనియా కపూర్‌ను హిమేష్ పెళ్లి చేసుకోనున్నారనే వార్త వైరల్‌గా మారింది.

 గర్ల్‌ఫ్రెండ్‌తో హిమేష్ రష్మియా పెళ్లి

గర్ల్‌ఫ్రెండ్‌తో హిమేష్ రష్మియా పెళ్లి

నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా తన గర్ల్ ఫ్రెండ్‌ సోనియా కపూర్‌ను మే 11న వివాహం చేసుకోనున్నారు. లోకండ్‌వాలాలోని హిమేష్ నివాసంలో నిరాడంబరంగా జరిగే ఈ వేడుకలో సోనియా కపూర్ మెడలో తాళి కట్టనున్నారు అని ఓ ప్రకటన విడుదల చేశారు.

అతిసన్నిహితులు, కుటుంబ సభ్యులు

అతిసన్నిహితులు, కుటుంబ సభ్యులు

హిమేష్ పెళ్లి కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే ఆహ్వానితులు. హిమేష్ తల్లిదండ్రులు, తన కుమారుడు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు అని అధికారికంగా ప్రకటనను విడుదల చేశారు.

 ఆ కారణం వల్లనే విడాకులు

ఆ కారణం వల్లనే విడాకులు

గతంలో కోమల్ అనే మహిళతో హిమేష్ పెళ్లి జరిగింది. వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో జూన్ 2017లో కోమల్‌తో విడాకులు తీసుకొన్నారు. కోమల్, హిమేష్ విడిపోవడానికి కారణం సోనియానే అని పుకార్లు వచ్చాయి.

సోనియా కారణం కాదు

సోనియా కారణం కాదు

అయితే తాము విడిపోవడానికి హిమేష్ కారణం, సోనియా అసలు కారణం కానే కాదని కోమల్ పేర్కొన్నారు. ఈ వివాదంలోకి ఎవరినీ లాగకూడదు. మా మధ్య విభేదాలు రావడంతోనే విడిపోయాం అని కోమల్ వివరణ ఇచ్చారు. ఆ తర్వాతనే సోనియాను పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బాలీవుడ్‌లో గుప్పుమన్నాయి.

English summary
Himesh Reshammiya is set to tie the knot with his longtime girlfriend Sonia Kapoor on May 11. It is said to be a traditional Gujarati wedding at Himesh's residence in Lokhandvala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X