బిగ్‌బాస్‌ భామపై కేసు.. రూ.12 లక్షల ఆభరణాలు మాయం, మీడియాలో బ్రేకింగ్ న్యూస్!

Recommended Video

బిగ్ బాస్ ఫేం నటి ఆభరణాల చోరి కేసు లో అరెస్ట్

నిజా నిజాలతో సంబంధం లేకుండా మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం జరగడం రోజురోజుకూ ఎక్కువవుతోంది. హిందీ మీడియా ఛానల్స్ లో బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ గురించి నేడు టివి ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ ప్రసారం జరుగుతోంది. హీనా ఖాన్ 12 లక్షల విలువైన ఆభరణాలు మాయమైన కేసులో ఆమె నిందితురాలేది ఈ వార్తల సారాంశం. ఈ వార్తలపై హీనా ఖాన్ ఎలా స్పందించింది, నిజా నిజాలు ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.

 బిగ్‌బాస్‌తో పాపులారిటీ

బిగ్‌బాస్‌తో పాపులారిటీ

టివి నటిగా మంచి గుర్తింపు పొందిన హీనా ఖాన్ బిగ్ బాస్ 11 తో మరింతగా పాపులర్ అయింది. కుర్రాళ్లకు గాలం వేసే హాట్ ఫోజులతో సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది.

 మీడియాలో బ్రేకింగ్

మీడియాలో బ్రేకింగ్

బాలీవుడ్ మీడియా, హిందీ న్యూస్ ఛానల్స్ లో హీనా ఖాన్ గురించి ఓ హాట్ న్యూస్ ప్రసారం జరుగుతోంది. ఓ జ్యువెలరీ షోరూంలో రూ లక్షల విలువైన ఆభరణాలు కనిపించకుండా పోయిన కేసులో హీనా ఖాన్ నిందితురాలట. ఈ మేరకు ఆమెకు నోటీసులు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

 యాడ్ షూట్ తరువాత

యాడ్ షూట్ తరువాత

ఓ జ్యుయలరీ షోరూంకు సంబంధించి ఆభరణాల యాడ్ షూట్ లో హీనా ఖాన్ పాల్గొనిందట. షూటింగ్ అనంతరం ఆభరణాలు తిరిగి ఇవ్వకుండా తనవెంటే తీసుకుని వెళ్లిపోయిందట. దీనితో సదరు షోరూం వారు హీనా ఖాన్ పై కేసు నమోదు చేశారని, ఆమెకు నోటీసులు అందాయని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అదిరేలా కౌంటర్ ఇచ్చిన హీనా ఖాన్

అదిరేలా కౌంటర్ ఇచ్చిన హీనా ఖాన్

ఈ వార్తలపై హీనా ఖాన్ ట్విటర్ లో స్పందించింది. ఆ లీగల్ నోటీసులు నా ఇంటికి రాకుండా అన్ని మీడియా హౌస్ లకు వెళ్లడం నిజంగా వండర్ అంటూ ట్వీట్ చేసింది. ఇలా కాదు .. ఇంకొంచెం కొత్తగా ట్రై చేయండి అని కామెంట్ పెట్టింది. మీడియాలో వస్తున్న వార్తలన్నీ గాలివార్తలే అని హీనా ఖాన్ చెప్పకనే చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X